కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
క్రైస్తవ జీవితము జీవించుటకు మనము కలిగి ఉండవలెనని దేవుడు ఆశించు మూడవ బిరుదు “ప్రియులైనవారు”
ప్రియులునైనవారికి తగినట్లు
” ప్రియులైనవారు ” అనే పదం యొక్క వ్యాకరణం మనలను ఎన్నుకున్నప్పుడు దేవుని ప్రేమ యొక్క శాశ్వతతను సూచిస్తుంది. దీని అర్థం మనం ఎప్పుడూ మారని దేవుని ప్రేమ పాత్రులము (రోమా. 5 8; 1 యోహాను : 9-11, 19). దేవుడు తన ప్రేమలో మార్పులేనివాడు, అంటే అతని ప్రేమ మన వైపు ఎప్పుడూ మారదు. దేవుని మన పట్ల కలిగిఉన్న ప్రమ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. దేవునిపై మన ప్రేమ క్షీణింపవచ్చు. మానవులుగా మనమందరం కొంతవరకు అస్థిరంగా ఉంటాము.
తండ్రి అనంతమైన ప్రేమతో కుమారుని ప్రేమిస్తాడు. మనము క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, దేవుడు మనల్ని ప్రియునిలో అంగీకరిస్తాడు (ఎఫె. 1:6). అందువలన, తండ్రి కుమారుని పట్ల ఎంత ప్రేమకలిగి ఉన్నాడో మనలను అంతగా ప్రేమిస్తున్నాడు – అనంతముగా.
“ప్రియులైనవారు” అంటే ప్రేమ పాత్రులుగా. “నన్ను ఎవరూ ప్రేమించరు” అని చెప్పే హక్కు ఏ విశ్వాసికి లేదు.
చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను– శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను
రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. (రోమా 1:2)
ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది (రోమా 5:5)
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. (రోమా 5:8)
నియమము:
దేవుడు తన ప్రజలకు మనోహరమైన బిరుదులను ఇచ్చాడు, తద్వారా వారు క్రీస్తులో తమ హక్కుల ఆధారంగా వారి క్రైస్తవ జీవితాలను గడుపుతారు.
అన్వయము:
క్రైస్తవులు వారు వారు ఏమైఉన్నారో దానిని జీవించాలి. వారికి ఏమి జరుగుతుందో వారు జీవించాలి. అలాంటి బిరుదులను కలిగి ఉన్నవారు మనుషులందరిపట్ల ప్రేమగా ఉండాలి.
ఈ బిరుదులతో (దేవునిచేత ఎన్నుకోబడిన, పరిశుధ్ధమైన, ప్రియమైనవారుగా) దేవుడు క్రైస్తవులను ఆలోచిస్తే, ప్రతి క్రైస్తవుడు ఒకరినొకరు ఈ విధంగా ఆలోచించాలి.