ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది
మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది
” క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది ” అనేది క్రీస్తులో మన శాశ్వతమైన భద్రత యొక్క ప్రకటన. ఇది మన నుండి దాగి ఉందని కాదు, అది మన కోసం దాచబడి ఉందని దీని అర్థం. యేసు మన జీవితాన్ని తనలో బధ్రపరుస్తాడు. దేవుడు మన కోసం పరలోకంలో నిత్యజీవమును సిద్దపరచి ఉన్నాడు (I పేతు. 1:4,5). “దాచబడి ఉంది” అనే క్రియ యొక్క గ్రీకు కాలం అంటే ఈ సందర్భంలో మన జీవితం గతంలో ఒక దశలో దాచబడి ఎప్పటికీ కొనసాగుతుంది అని సూచిస్తుంది. మనము క్రీస్తును స్వీకరించిన సమయంలో, శాశ్వతమైన జీవితం ప్రారంభమైంది మరియు శాశ్వతంగా కొనసాగుతుంది. క్రీస్తు వచ్చినప్పుడు (వ.4), క్రీస్తులో దాగి ఉన్న జీవితం ఆయనతో వెళుతుంది.
” క్రీస్తుతోకూడ దేవునియందు” అనునది డబుల్ కవచమును సూచిస్తుంది. మనము బ్యాంకులో మాత్రమే కాదు, బ్యాంకు ఖజానాలో ఉన్నాము. క్రీస్తును విశ్వసించే వ్యక్తి యొక్క భద్రతను దేవుడు రెట్టింపుగా రక్షిస్తాడు.
“క్రీస్తుతోకూడ” అనునది గుర్తింపును సూచిస్తుంది. విశ్వాసికి క్రీస్తు మరణంతో మరియు మనలను దేవుని వద్దకు తీసుకువెళ్ళే పునరుర్ధానుడైన ప్రభువుతో సహవాసపు గుర్తింపు ఉంది.
నియమము:
ఏ చొరబాటుదారుడు, సాతాను కూడా మనలను దేవుని నుండి వేరు చేయలేడు. విశ్వాసికి దేవుని ముందు రెట్టింపు భద్రత ఉంది.
అన్వయము:
దేవుడు మనలను క్రీస్తుతో కలిసి దేవునితో భద్రపరచాడు. క్రీస్తుయేసునందు దేవుని ప్రేమ నుండి మనల్ని యేదికూడా వేరు చేయలేరు (రోమా. 8:31-39). జీవితంలో ప్రమాదకర పరిస్థితులకు వ్యతిరేకంగా దేవుడు మన స్థానాన్ని భద్రపరుస్తాడు. మన స్వంత ఇష్టాలు, ఇతర వ్యక్తులు లేదా అపవాది దేవుని ముందు మన శాశ్వతమైన స్థితిని తాకలేరు.
క్రీస్తును త్యజించకపోతే క్రిసోస్టోమ్ ప్రాణాలను తీసుకుంటానని సీజర్ బెదిరించినప్పుడు, “మహారాజా! మీరు తీయలేరు, నా జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది” అని పలికాడు.
విశ్వాసి యొక్క శాశ్వతమైన భద్రత దేవుని ముందు క్రీస్తులో మన స్థానం. ఇది క్రీస్తు మనకోసం చేసిన కార్యము. దీనికి మనం చేసే పనులతో సంబంధం లేదు. మనం జీవిస్తున్న జీవితం ద్వారా ఈ స్థానాన్ని పొందలేము. మనము క్రీస్తులో మరణించిన మరణంలో భద్రత ఉంది. దేవుని ముందు మన శాశ్వతమైన భద్రత కృపసంబంధమైన విషయం. మనము చేసుకోలేనిది, దేవుడు దయచేయునది కృప,.
మనం చేసే పనుల ద్వారా మనం క్రైస్తవులం కాదు. మనం చేసే పనుల ద్వారా కాదుకానీ మనం ఏమైఉన్నమో దాని ద్వారా మనం దేవునిలో భద్రంగా ఉన్నాము. ఏదేమైనా, మనం మనం ఏమైఉన్నమో ఏమి అయ్యామో అది మనం దేవుణ్ణి సంతోషపెట్టే జీవితంలోకి ప్రేరేపిస్తాయి.