Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.

 

పైనున్న వాటినే వెదకుడి

కొలస్సీ పత్రికలోని మిగిలిన ఆచరణాత్మక విభాగంలో “వెదకుడి” అనేది అనేక ఆదేశాలలో మొదటిది. “వెదకుట” అంటే వెంబడించడం, పొందటానికి ప్రయత్నించడం, కలిగి ఉండాలనే కోరిక. ఒక న్యాయవాద సంబంధి దీనిని వ్రాస్తుంటే అతను “కూడదు…” అని వ్రాస్తాడు, కాని పౌలు “వెదకుడి …” అని వ్రాస్తున్నాడు. మన శాశ్వతమైన హక్కులను ప్రస్తుతమునకు వర్తింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ హక్కులను మన రోజువారీ జీవన పరిధిగా చేసుకోవాలి. పునరుర్ధానుడైన  మరియు మహిమపరచబడిన క్రీస్తుపై మన జీవితాలను కేంద్రీకరించాలి.

క్రీస్తులో మన హక్కులను, క్రీస్తులో మన స్థానాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనికి అధ్యయనం మరియు కృషి అవసరం. చాలామంది క్రైస్తవులు సరదాను కోరుకుంటారు – “మా ఆట పాటల సమూహానికి రండి.” ఇతరులు కష్టాలను కోరుకుంటారు – “మా నియమాలు మరియు నియంత్రణ క్లబ్‌కు రండి.” మన స్థానాన్ని మన దైనందిన జీవితానికి అనుగుణంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోజువారీ జీవితం ఈ స్థానానికి అనుగుణంగా ఉంటుంది.

ఈ కోరిక క్రైస్తవ జీవితమంతా కొనసాగాలని గ్రీకు భాషలో వాడిన పదము యొక్కకాలం సూచిస్తుంది. ” వెదకుడి ” అనే పదం ఒక ఆజ్ఞ, ఎందుకనగా దేవుడు వాస్తవానికి సంబంధించి పనిచేయమని పిలుపునిస్తున్నాడు .

“పైన ఉన్న వాటిని” అనగా పరలోకపు విషయాలు అని అర్ధము – మన స్థాన సత్యం. స్థాన సత్యాన్ని కోరుకునే రోజువారీ వైఖరి ప్రభువుతో రోజువారీ సహవాసాన్ని కలిగి ఉంటుంది.

పైనున్న విషయాలను వెతకడం ఎలాగో తదుపరి వచనాలు వివరిస్తాయి. క్రైస్తవేతరులు భూమికి కట్టుబడి, లౌకికవాదులు, భౌతికవాదులుగా ఉంటారు. వారు రుచి చూచు, కనులతో చూసే మరియు అనుభూతి చెందుతున్న ప్రపంచంలో పనిచేస్తారు. శరీరం మరియు ప్రాణమును కలిసి ఉంచడానికి వారు తమ సమయాన్ని వెచ్చిస్తారు. అది వారికి జీవితం. జీవితము దాని కంటే ఎక్కువ అని వారికి తెలియదు. క్రైస్తవునికి, అతని జీవితం క్రీస్తు (వ.4). ఇది ఉనికి కంటే చాలా ఎక్కువ. మన జీవితాలను క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, జీవితం ఒక ఉద్దేశ్యాన్ని కలిగి, విలువైన జీవితాన్ని కలిగిఉంటుంది.

బైబిల్ రచనా రూపములో ఉన్న దేవుని మనస్సు. క్రైస్తవ జీవితానికి మనకు అవసరమైనది వ్రాతపూర్వకంగా ఉంది. దాన్ని త్రవ్వటానికి సహాయముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు.

నియమము:

ప్రతి ఆధ్యాత్మిక స్థానం విశ్వాసం ద్వారా తీసుకోవడం కొరకు మరియు ప్రతి ఆధ్యాత్మిక కార్యము విశ్వాసం యొక్క చర్య కోసం.

అన్వయము:

దేవుడు మన పవిత్ర నడకను రెండు రంగాలలో నిలుపుతాడు:

 1 క్రీస్తు విజయాలపై విశ్వాసం మీద దైవిక జీవన ఆధారపడి ఉంటుంది.

2 క్రీస్తు విజయాలపై నిరంతర విశ్వాసం ద్వారా దైవిక జీవనం నిర్వహించబడుతుంది.

క్రీస్తు చేసినదానిపై మనం ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం చేసే పనులపై కాదు. దేవుని యెదుట మనము కలిగి ఉన్న ప్రతిదీ మన రక్షణ వలన క్రీస్తులో విలీనం చేయబడినందున మనకు కలిగినది. క్రైస్తవ అనుభవం క్రీస్తులో మన స్థానంతో సంబంధం కలిగి ఉండాలి.

Share