Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా ….అను విధులకు మీరు లోబడనేల?

 

లోకముయొక్క మూలపాఠముల విషయమై

” మూలపాఠములు” అనే గ్రీకు పద౦, మొదటి సూత్రాన్ని సూచిస్తు౦ది.  అక్షరార్ధకముగా వరస, ర్యాంక్, క్రమము అని అర్థం.  క్రియాత్మక పదముకు వరుసలో నడవడం అని అర్ధము.  ఇది రాయడంలో అక్షరాల ప్రాథమిక అంశముగా ఉన్నట్లుగా ఉపయోగించబడినది.

2:8లో  ఈ పదాన్ని, అన్యమత ఆరాధనలు, యూదుల న్యాయవాదము అనే ఊహాగానాలకు ఉపయోగించబడినది.

2 పేతురు 3:10, 12లో వస్తు ప్రప౦చ౦లోని పదార్ధాలకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు.

గల 4:3, 9లో, మతానికి సంబంధించిన ప్రాధమిక సూత్రాలు కొరకు ఉపయోగింపబడినది.

హెబ్రీ. 5:12లో, ఆధ్యాత్మిక పసివారికి ప్రాథమిక సూత్రాలు బోధి౦చబడినవి.

యేసు మత౦ యొక్క ప్రాథమిక సూత్రాలనుండి ను౦డి మనలను విడిపి౦చాడు.

లోకములో బ్రదుకుచున్నట్టుగా

స్థాన సత్యాన్ని అర్థం చేసుకోని ఒక విశ్వాసి దానిని నకిలీ చేయడానికి ప్రయత్నిస్తాడు.  ఆయన మనుషులను మోసపుచ్చవచ్చు కానీ దేవునిని కాదు. బైబిల్ గురించి తెలియని ఒక విశ్వాసి ఆధ్యాత్మిక భూతము వంటి వాడు.

మన౦ క్రైస్తవ జీవిత౦లో ఆసక్తులను, లక్ష్యాలను, ఆనందాలను కనుగొ౦టే, అన్య తత్త్వాన్ని ఎ౦దుకు దానిలోకి చొప్పించలి?  యేసు మన పాపముల కొరకు మరణించలేదనట్లు మనం బ్రతుకుతున్నాం.  మనము క్రీస్తుతో మృతిచెందితే, సమస్త ప్రాపంచిక సంబంధాలు ఆగిపోతాయి.  కేవలం నియమాలు మనకు ఎక్కడాకూ నడిపించవు.  క్రీస్తులో నూతన జీవన రంగము యొక్క పరసంబంధ శక్తిని కలిగి మనం జీవించాలి.

నియమము:

యేసు మనలను దేవుని జీవితములోనికి మళ్లించారు.

అన్వయము:

యేసు ప్రాథమికవాద౦ ను౦డి మనలను విడిపి౦చాడు, అలాంటప్పుడు మన౦ ఎ౦దుకు న్యాయవాదములో జీవిస్తూనే ఉ౦డాలి?  తీవ్రమైన స్వీయ నిరాకరణ ద్వారా దేవునిని సంతోష పెట్టాలని మనం కోరుకుంటాం.  క్రమశిక్షణ గల దేవుడిని తయారు చేసుకోవచ్చు.  మనము సన్యాసత్వములో కుటిలమైన ఆనందాన్ని తీసుకోవచ్చు.

మార్టిన్ లూథర్ రాత్రంతా తన గదిలో కాటిక చలిలో నగ్నంగా పడుకున్నాడు తన శరీరాన్ని కొట్టుకుంటూ.  ఇది దేవుణ్ణి సంతోష పెడుతుంది అని ఆయన భావించాడు.  తనను తాను వేధించుకోవడము వల్ల తన ఆత్మకు శాంతి చేకూరుతుందని అనుకున్నాడు.  రోమా పత్రిక చదవడం ద్వారా దేవుడు ఆయనను ఈ సన్యాసత్వము నుండి విముక్తి కలిగించారు.

Share