Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి

 

తాను చూచినవాటినిగూర్చి

ఈ వ్యక్తి “తాను చూడని” తన స్వంత మతమును కనుగొంటాడు.  అతనికి మీకు-మీరే-చేసుకోండీ అనే మతము ఉంది.  అతను వెళ్లే కొద్ది దానిని రూపుదిద్దుతాడు.

మీకు మీరే దేవుడనని చెప్పుకుంటే  మీరు సహాయం కోసం ఎదురు చూడడానికి మీ పైన ఎవరూ ఉండరు; మీరు కేవలం ప్రతి ఒక్కరి మీద మాత్రమే చూడగలరు. ఈ రకమైన అవివేక విషయములో ఈ ప్రమాదము ఉంది. ఒక ఆధునిక సామెత దీనికి చక్కగా జవాబిస్తో౦ది: “ఈ రె౦డు విషయాలను మరచిపోకూడదు.

-దేవుడు ఒక్కడే.

-“ఆ దేవుడు” మీరు కాదు!

అబద్ధ బోధకులు “వ్యర్థమైన” భావనలను అనుసరిస్తారు.  బైబిలు ప్రకటించని, ఏ ఆధారమూ లేని పారవశ్యపు అనుభవాల్లో జ్ఞానవాదము ప్రవేశించింది.  లేఖన౦లోని సముదాయము(బైబిలులో ఉన్న పుస్తకాల పట్టిక) మూసివేయబడ్డాయి కాబట్టి, దేవుని ను౦డి మరి౦త ప్రకటన చేయవలసిన అవసర౦ లేదు.

ఈ విధమైన వ్యక్తి తన కలలకు, దర్శనాలకు పరిశుద్ధాత్మను నిందింస్తూ ఉంటాడు.  ఈ రోజుల్లో ఇది సర్వసాధారణమే.  “ప్రభువు ఈ దర్శనము నాకు చెప్పాడు.”  ఎప్పుడు?  ఎలా?  “నాకు ఒక అనుభూతి కలిగింది, ఒక కలవచ్చింది.”  ఈ ఆలోచనకు అధ్యాయం, పుస్తకం, వచనం ఏమిటి?  దానికి లేఖనాధారిత మద్దతు లేకపోతే, అది ఎ౦త ఆధ్యాత్మిక అవివేకామో అని తనిఖీ చేయాలి.  అది ఆధ్యాత్మిక భ్రా౦తి.

బైబిల్ పూర్తి కావడానికి ముందు దేవుడు విశ్వాసితో సంభాషించడానికి దర్శనాలను ఉపయోగించాడు.  నేడు దర్శనాలు అస్పష్టమైనవి, నకిలీ, అపోక్రిఫల్ మరియు విశ్వసనీయం కావు.  భావోధ్వేగాలు స్థిరమైనవి కావు గనుక మన భావోధ్వేగాల ఆధారంగా మనం వెళ్లలేము.  మనం ఒక క్షణం, చెడుగా మరో సారి మంచిగా భావిస్తాం.  క్రైస్తవేతర భావోధ్వేగాలకన్నా క్రైస్తవుల భావోధ్వేగాలు మరింత నమ్మదగినవి కావు. ఎప్పటిలానే పతనమైన మన స్వబహావము తప్పు, అంతర్గత, దుర్మార్గానికి లోనవుతోంది.  కేవలం దేవుని వాక్యము మాత్రమే విశ్వసనీయమైన ప్రమాణం విశ్వసనీయమైన మార్గదర్శకం.  ” ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు ” (రోమా. 3:4).

గొప్పగా చెప్పుకొనుచు

” గొప్పగా చెప్పుకొనుచు” అనే పదానికి ప్రాథమికంగా, దానిలో లేదా దానిమీద అడుగు వేయడం అని అర్థం.  క్రొత్త నిబంధనలో ఈ భాగములోనే ఇది కనిపిస్తుంది.

” చొరబాట్లు” అంటే తరచుగా, నివసించడమని (మన లేఖన భాగములో) అర్థం.  ఈ పదం ఆక్రమించడము, ప్రవేశించడము అని  అర్థం.  ఎ౦దుక౦టే కొలస్సీ పత్రిక జ్ఞానవదానికి వ్యతిరేక౦గా వాదిస్తుంది కాబట్టి బహుశా మర్మమైన మతాల్లోకి ప్రవేశ౦ అని అర్థ౦.  మర్మమైన మతములు ఈ పదాన్ని బద్ధకంగా ఉపయోగించగా.  ఈ వ్యక్తి మతం లోకి ఉపక్రమించినప్పుడు మర్మాలలో అతను చూసిన దాని ఆధారంగా ఒక స్టాండ్ తీసుకున్నాడు.

తన శరీరసంబంధమైన మనస్సు వలన

పాప సామర్థ్యం శరీరాశ మచ్చులను ఉత్పత్తి చేస్తుంది.  పాపము ఉద్భవించేది వాటి నుండే.

ఊరక ఉప్పొంగుచు

” ఉప్పొంగుచు” అంటే ఊబ్బడం, గాలిని నింపడం . ఇది కొత్త నిబంధన లో గర్వం తో నింపబడుట అనే అర్థంలో ఉపయోగించబడినది (I కొరిం 4:6, 18, 19; 5:2; 8:1; 13:4; కొల 2:18).  మతం మనల్ని అహంకారంతో నింపగలదు.  అతిశయమైన అహ౦కార భక్తి వ్యర్థమే (1 కొరిం 8:1)

నియమము:

వినయముగా అగుపడుట తరచూ స్వచ్ఛమైన గర్వము.

అన్వయము:

మతనాయకులు దేవుని గురి౦చి తమకున్న సొ౦త అభిప్రాయాలను బయట పెట్టుటకు ప్రయత్నిస్తారు, ఎ౦దుక౦టే అది వారికి అ౦దరి మీద ఒక పట్టును ఇస్తు౦ది.  ఇది ఆధ్యాత్మిక అహంకారం, ప్రత్యేక అభిప్రాయాలను పురోగమించే విషయమై ఆసక్తి.  అది వారిని మత సమాజములో ప్రత్యేక స్థానంలో ఉంచుతుంది.  ఇతర క్రైస్తవ నాయకుల కంటే తెలివైన వారిగా భావించబాడుట వారికిష్టము. అహంకారం అనేది అనేక మతసంబంధ దోషాలు మరియు అవినీతికి పునాది వద్ద ఉంది.  అది అనేక దుష్ట విధానాలకు స్థావరం.

Share