Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.

 

తప్పుడు తత్వానికి వ్యతిరేకంగా పౌలు యొక్క వివాదం దాని కృత్రిమ పద్ధతిని బహిర్గతం చేస్తుంది.

మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత

బోలుగా ఉన్న ఒక తత్వశాస్త్రం ఉంది. కొలస్సీలో ఉన్న తత్వశాస్త్రం ‘ఖాళీ’ (శూన్యత). ఈ తత్వశాస్త్రం క్రైస్తవ్యమునకు వ్యతిరేకంగా దాని పూర్వభావములను ఏర్పాటు చేస్తుంది మరియు దాని స్వంత ఊహల ఆధారంగా సారాంశాలను కలిగిఉంటుంది. ఈ తత్వశాస్త్రం అబద్ధమైనది ఎందుకంటే ఇది పక్షపాతము కలిగినది.

‘మోసం’ అంటే మభ్యబెట్టడము. ఇది ప్రదర్శన, ప్రకటన లేదా ప్రభావం ద్వారా తప్పుడు అభిప్రాయాన్ని ఇస్తుంది. తప్పుదారి పట్టించే తత్వశాస్త్రం, ఇది సత్యమును గురించి ప్రజలను మోసం చేస్తుంది లేదా అబద్దముగా ప్రేదర్శిస్తుంది.

మత్తయి 13:22 ధనము కలిగించే  మోసానికి ‘ధనమోహము’ అనే పదాన్ని ఉపయోగిస్తుంది,

ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

హెబ్రీయులలో 3:13 ఈ పదాన్ని పాపపు బ్రమకు ఉపయోగిస్తుంది,”

పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు–నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధిచెప్పుకొనుడి.”

ఎఫెసీయులకు 4:22 దురాశలవాలన కలుగు ‘మోసం’ గురించి ఉపయోగించబడినది,

“కావునమునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని”

II థెస్సలొనీకయులు 2:10 ఈ పదాన్ని అన్ని రకాల కపటమైన సంభాషణలు మరియు పనుల కోసం ఉపయోగిస్తుంది,

“దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును”

ఈ విషయాలన్నీ సూక్ష్మంగా మరియు కృత్రిమంగా మనలను క్రీస్తు నుండి దారితప్పాయి. మోసపూరితంగా బలహీనపడిన వ్యక్తి, ‘నేను దానిని నమ్మలేను. నేను సామాజికతత్వాన్ని నమ్ముతున్నాను. నేను నా జీవితంలోనుండి బైబిలును తొలగించేశాను. అని అంటాడు.

నియమము:

మానవ మత తత్వశాస్త్రం శూన్యతను కలిగి ఉంది.

అన్వయము:

ప్రపంచంలోని మత తత్వాలను అనుసరించే క్రైస్తవుడు ఖాళీ బ్రమపై పనిచేస్తాడు.

బ్రమకలిగించే రెండు ప్రాంతాలు ఉన్నాయి

-తప్పుడు సిద్ధాంతం.

-విషయాల విగ్రహారాధన (ఉదా., ధనము).

తప్పుడు తత్వశాస్త్రం రెండు స్థాయిలను తీసుకుంటుంది, ఆలోచనల స్థాయి లేదా రోజువారీ జీవిత స్థాయి. మనం దేవునికి విరుద్ధమైన నమ్మక వ్యవస్థల్లోకి అమ్ముడు పోతే, అది క్రైస్తవ జీవితానికి విపత్తుగా మారుతుంది.

సొలొమోను ఆనందం, సముపార్జన, స్త్రీలు, అధికారం మొదలైన వాటిలో తృప్తీని పొందాలని కోరిన తరువాత, అతను ‘ ‘సమస్తమును వ్యర్ధమే’ అని ప్రకటించాడు. విశ్వాసి దేవుని వాక్యానికి దూరమైతే స్వీయ-ప్రేరిత దుఖంలోకి ప్రవేశిస్తాడు. అతను తన డబ్బును, స్నేహితులను లేదా విజయాన్ని కోల్పోతే, అతను కూలబడుతాడు. బౌతికమైన వాటిని  వెంటాడటం ఒక వ్యక్తిని ఎప్పుడూ సంతృప్తిపరచవు.

Share