కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా … ఆయనయందుండి నడుచుకొనుడి.
ప్రభువైన యేసు నామములు చాలా సమాచారయుక్తమైనవి. ఇచ్చిన సందర్భంలో రచయిత ఉద్దేశించిన సూక్ష్మ బేధములను అవి వెల్లడిస్తాయి. ఈ వచనములో మనం కనుగొన్నది ఇదే.
ప్రభువైన క్రీస్తుయేసును
‘ప్రభువైన క్రీస్తు యేసు’ అని గ్రీకు బాషలో ఉన్నది. రెండు నిర్దిష్టోపపదములు గమనించండి. ఇది మన ప్రభువు యొక్క పూర్తి నామము.
‘ప్రభువు’ అనే నామమును గమనించండి. మన రక్షకుడిగా యేసుక్రీస్తును స్వీకరించినప్పుడు, మనకు రక్షకుడి కంటే ఎక్కువ లభిస్తుంది; మనము ఒక ప్రభువు పొందుతాము. ఎవరికివారు తమ భార్యను వివాహం చేసుకున్నప్పుడు, ‘నేను నిన్ను వ్యాపారంలో నా భాగస్వామిగా తీసుకుంటాను’ అని చెప్పలేదు. లేదు, మనము ఆమెను మన భార్యగా తీసుకున్నాము. వ్యాపారంలో భాగస్వామ్యం వివాహం యొక్క ఒక కోణాన్ని కలిగి ఉండవచ్చు. మనము క్రీస్తును స్వీకరించినప్పుడు, మనం బేరం కుదుర్చుకున్న దానికంటే ఎక్కువ పొందుతాము. మనము క్రీస్తువద్ద ప్రారంభించినప్పుడు మన రక్షణ గురించి మనకు పెద్దగా తెలియదు, కాని వీలైనంత త్వరగా ఆయన మనకు ప్రభువు అని గుర్తించాలి.
ఆయన ప్రభువు (2కొరిం. 4:5). ఆ విషయము మనల్ని దాసులుగా చేస్తుంది. మనం ఇకపై మన సొంతం కాదని తెలుసుకోవాలి. మన రక్షకుడు మరియు ప్రభువు మనల్ని కొన్నారు, విమోచన క్రయధనము చెల్లించి మరియు విమోచించారు.
నియమము:
యేసుక్రీస్తు రక్షకుడి కంటే ఎక్కువ; ఆయన మన ప్రభువు.
అన్వయము:
యేసు క్రీస్తు మన జీవితాలకు ప్రభువు అని మనం గుర్తించాలి. ఆ గుర్తింపు మన జీవిత విధానమును మారుస్తుంది. సాధారణ సంకల్పం క్రైస్తవ జీవితాన్ని అమలు చేయదు. ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండు స్పృహను కోల్పోయినప్పుడు, మనం పాపం చేసి విఫలమవుతాము. అందువల్ల, మనలను విడిపించేది సంకల్పం కాదు, మన సంకల్పం యొక్క విశేషము యేసు ప్రభువును వెల్లదించు దేవునివాక్యము వ్యత్యాసమును కలిగిస్తుంది.
ప్రభువైన యేసుక్రీస్తు మన ఎంపికల వస్తువునా? క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును మరియు కార్యమును మన జీవితానికి తగినట్లుగా ఎంచుకుంటే, సార్వభౌమ ప్రభువు క్రైస్తవ జీవితాన్ని అమలు చేయడానికి మనల్ని బలపరుస్తాడు. సార్వభౌమ ప్రభువును ప్రభువుగా గుర్తించినప్పుడు, దేవుడు మనకోసం కోరుకునే జీవితాన్ని గడపడానికి మనకు సహాయం చేస్తాడు.