Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

 

జయోత్సవముతో

విజయ౦ సాధి౦పు ఊరేగింపులో యుద్ధ ఖైదీలను నడిపించుట ” జయోత్సవముతో” అనే మాటలో ఉన్నది. యుద్ధ౦లో యుద్దములో చెరగొన్నవారిని నడిపిస్తున్నఒక సైనిక ఊరేగి౦పును ఈ సన్నివేశము తలపిస్తుంది. అది ప్రతిపక్షముపై విజయ జయకేతనం ప్రదర్శించడం. ఒక సేనాధిపతి తన చెరను రోమ్ వీధుల గుండా నడిపించవచ్చు. అతని వెనుక ఓడిపోయిన రాజులు, రాజకుమారులు, ప్రజలు అనుసరిస్తారు. బాహాటంగానే తన బాధితులుగా చెరగొన్నవారిగా ముద్రవేయాబాడుతారు. ఇది ఒక రోమన్ సేనాధిపతి సాధించగలిగిన అత్యున్నత గౌరవము. ఇది రోమన్ చరిత్రిక కాలంలో ఒక సాధారణ సాంస్కృతిక దృగ్విషయంగా ఉండేది.

ఈ గౌరవానికి కొన్ని ముందస్తు అవసరాలుగా ఉండేవి.

-ఈ సేనాధిపతి యుద్ధరంగంలో ప్రధాన సేనాధిపతి అయి ఉండాలి.

-దాడి పూర్తిగా విజయవంతమై ఉండాలి.

-యుద్ధంలో పెద్ద సంఖ్యలో శత్రు సైనికులు పడిపోయి ఉండాలి.

-ఆయన రోమా సామ్రాజ్య౦ కోస౦ భూభాగాన్నీ విస్తరి౦చేలా చేసిఉండాలి.

యేసు ఈ షరతులన్నీ సంతృప్తిపరచాడు:

-అతను యుద్ధ రంగంలో (సిలువపై) సైన్యములకు అధిపతిగా ఉన్నాడు–ది క్రాస్.

-సిలువపై యేసు మన పాపాలకు పూర్తిగా మూల్యము చెల్లించాడు.

-సాతాను, అతని ప్రతినిధులు ఓటమి పాలయ్యారు.

-తన మీద నమ్మకం ఉన్నవారికి మోక్షాన్ని, శాశ్వతమైన భవిష్యత్తును ఆయన భద్రపరచారు.

యేసు తన విజయోత్సవ ఊరేగింపులో పడిపోయిన దేవదూతలను నడిపి౦చాడు. ఆయన తన విజయ శిలువతో ముందంజలో ఉన్నాడు, ” ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ” II కొరింథీయులకు 2:14. యేసు పడిపోయిన దేవదూతలపై  విజయ౦ సాధి౦చి కొలొస్సయులు 2:15 (పరాజితులయొక్క ప్రదర్శన) వారిని నడిపి౦చాడు; 2కొరిం2 :14 లో ఆ నడిపి౦చే వారు అవమానాలకు గురిచేయుటకు కాదు, జయించిన వానికి గర్వకారణముగా ప్రదర్శిస్తారు.

ఈ సందర్భంగా సేనాపతి కుమారులు వివిధ అధికారులతో కలిసి తన రథం వెనుక బారులు తీర్చి ఉన్నారు. ఈ సందర్భంలో ప్రధాన ఆలోచన “ప్రదర్శన” యైయున్నది

ధర్మశాస్త్రపు అర్ధనలను నెరవేర్చుటవలన యేసు దయ్యముల సంబంధమైన అధికారాలను ప్రధానులను నిరాయుధులనుగా చేశాడు. ఆ విశ్వాసిని న్యాయవాదమును నడిపించే శక్తుల నుంచి ఆయన విడిపించుకున్నాడు.

కొలొస్సయలోని జ్ఞానవాదులు, ఆకాశమండలశక్తులైన దేవదూతలు, దయ్యాల తరగతులు, విభాగాల గురించి నమ్మారు. పధార్ధము దుష్ట రాజ్యంగా ఉండేది. పరసంబంధుడైన క్రీస్తు శత్రువును ఓడించారనేది పౌలు వాదన. యేసు వారి ఆయుధాలను ఊడదీసి, తన ఓడిపోయిన శత్రువుని ప్రదర్శనకు పెట్టాడు. తనకు వ్యతిరేక౦గా ఉన్న ఆధ్యాత్మిక శక్తులను ప్రస్పుటము చేశాడని యేసు దేవాడుతాల సమూహమునకు స్పష్ట౦గా తెలియచేశాడు.

యేసు తన మరణము ద్వారా ఒక అమరమైన విజయాన్ని పొందాడు. “సిలువచేత” ఇది సాధ్యమైనది. పోరాటం భీకరమైనదిగా ఉండినది; పోటీదారుడు చనిపోయాడు; కానీ మరణిస్తూ ఆయన విజయం సాధించాడు (I కొరింథీయులకు 15:57). అతని శత్రువు పునరుత్థానాన్ని ఊహించలేదు. యేసు పునరుత్థాన ద్వారా శత్రువును పూర్తిగా ఓడించాడు చేసాడు (రోమా 8:37; హెబ్రీయులు 2:14-15; I యోహాను 3:8). అపవాది గురి  మరలా తప్పింది. పతనమైన దేవదూతలు ఇక యేసు చనిపోయాడు అని భావించాయి.

నియమము:

సాతాను శక్తులపై యేసు మనకు సాటిలేని, అంతిమ ఆధ్యాత్మిక విజయాన్ని సిలువపై సాధించాడు.

అన్వయము:

ధర్మశాస్త్రపు శాపము మనకు విరోధముగా ఉన్నట్లుగా అపవాది శక్తి మనకు విరోధముగా ఉందినది. యేసు అపవాదిని, తన శక్తులన్ని సిలువపై నిరాయుధులనుగా చేసాడు. ఇది బైబిలులో ప్రకటింపబడిన మొదటి సువార్త, ఆదికాండము 3:15

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను

యేసు అపవాదిని ప్రాణాంతకముగా దెబ్బతీశాడు, అయితే సాతాను యేసును కేవల౦ ప్రాణాంతకము కాని (“మడమ”) విధముగా వ్యవహరించాడు. ఇప్పటికే ఓడిపోయిన శత్రువును ఓడించనవసరము లేదు.

Share