ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి
క్రొత్త నిబంధన, పాలన చేసే అభౌతిక జీవులకు ” ప్రధానులను” అనుమాటను ఉపయోగిస్తుంది: దేవదూతలు (ఎఫెసీయులు 3:10); దుష్ట దూతలు (రోమా 8:38; కిలస్సీ 2:15). యూదా 6, పడిపోయిన దేవదూతల అధికారికమైన శక్తిని సూచిస్తుంది. ” ప్రధానులను” అనేది గౌరవము (ప్రముఖుల) యొక్క ఒక పదం, “అధికారాలు” అనేది కార్యనిర్వాహక అధికారానికి సంబంధించిన పదం.
” అధికారులను” ఏదైనా చేయడానికి అధికారం కలిగిన వారు. ఈ పదం అధికారము బలము అను రెండు భావాలను మిళితం చేస్తుంది. కాబట్టి, ” ప్రధానులను అధికారులను” అనే పదాలు సాతాను క్రి౦ద పనిచేయు పతనమైన దూతలను సూచిస్తుంది.
” నిరాయుధులనుగాచేసి” = తనను తాను ఖాళీచేసుకోవడము. ఈ పద౦, ఆయుధాలకు తొలగించుట వల్ల ప్రధానాత్వాన్ని, అధికారాన్ని తొలగించుటను అలంకార రూపములో తెలుపుతుంది. యేసు దయ్యాల శక్తులను పారదోలాడు. వారి అధికారాన్ని ఆయన ఊడగొట్టారు. ఆయన ఒక్కసారిగా వాటి అధికారాన్ని విరగగొట్టాడు.శరీర౦కార్యములను విసర్జించుటకు మనల్ని సవాలు చేస్తున్నప్పుడు పౌలు అదే క్రియను 2:11 లో ఉపయోగి౦చాడు. పౌలు “ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి ” ” శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి” అను వాటిని కలుపుతున్నాడు.
నియమము:
యేసు సిలువద్వారా దయ్యములనుండి వాటి ఊడదీసాడు; సిలువ ద్వారా సాతాను దాడిని ఎదుర్కోవాలని దేవుడు మననుండి ఆశిస్తున్నాడు.
అన్వయము:
యేసు సిలువపై దుష్టశక్తుపై జయశీలుడైయ్యాడు. మన జీవితాల్లో ” ప్రధానులను అధికారులను” ఓడించడానికి మన౦ ఆధ్యాత్మిక ఆయుధాలను ఉపయోగి౦చాలని దేవుడు ఆశిస్తున్నాడు (ఎఫ. 6:12).