మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు … మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;
ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను
యేసు తన మరణాన్ని మన జీవితము కొరకు మార్పిడి చేసాడు. మనము ఇప్పుడు క్రీస్తులో దేవునికి ఆధ్యాత్మికంగా జీవించి ఉన్నాము. మనం ఇంతకు ముందు కంటే ఇప్పు(ఎఫే 2:4,5)
మరణం అనేది పాప సామర్థ్యాన్ని కలిగి ఉండటం యొక్క ఫలితం. ఆదాము పాప౦ చేయడానికి ము౦దు ఆయనకు పాప౦ చేసే సామర్థ్య౦ లేదు కాబట్టి ఆయన ఎన్నడూ మరణాన్ని చవిచూడలేదు. ఒకసారి పాప౦ చేసి అతను పాపపు సామర్థ్యాన్ని స౦పాది౦చుకున్నాడు. ఆధ్యాత్మిక, భౌతిక మరణాలు రెండూ అనుభవించాడు. “పాపమునకు జీతము మరణము” (రోమా 6:23). యేసు మన మరణం తీసుకుని మనకు నిత్యజీవమును ఇచ్చాడు అనునది సువార్త. (యోహాను 1:4; 14:6; I యోహాను 5:10-12). మన మొదటి జన్మలో మన తల్లిదండ్రుల నుండి భౌతికమైన జీవితాన్ని స్వీకరిస్తాం; మన రెండవ జన్మలో ఆధ్యాత్మిక జీవితాన్ని, నిత్య జీవితాన్ని పొందుతాం.
ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను అంటే జీవితాన్ని భరిస్తూ, సజీవంగా ఉత్పత్తి చేయడం, సజీవంగా భద్రపరచటం. మా మతమార్పిడిలో క్రీస్తుతోపాటు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాము (ఎఫెసీయులు 2:5). మనకు రక్షణ అనిగ్రహించిన మరుక్షణమే దేవుడు ఈ జీవితాన్ని మనకు దయచేస్తున్నాడు. క్రీస్తుతో మన సమాఖ్యలో దేవుడు మనలను క్రీస్తులో సజీవంగా ఉండేలా చేస్తాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరిస్తున్నప్పుడు, దేవుడు వారికి తన జీవమును ఇవ్వడానికి దైవిక ఆపరేషన్ చేస్తాడు.
నియమము:
మనము రక్షణను పొందునప్పుడు దేవుడు తన స్వంత జీవమును – నిత్య జీవమును దయచేస్తాడు.
అన్వయము:
చనిపోయినవారికీ నొప్పి ఉండదు. నశించిన వారు తాము నశించిపోయారని తెలీదు కారణము వారు దీన్నిని స్పర్శించలేరు. చనిపోయిన యే వ్యక్తి తాను చనిపోయాడని తనకు తెలీదు. ఒక వ్యక్తి నశించిపోయాడన్న విషయము తనకు తెలియాలని లేదు. అవిశ్వాసి నిశించిపోతున్న స్థితిలో ఉన్నాడు.
మనము “బ్రతికింపబడినప్పుడు” నిత్యజీవముకై యేసు క్రీస్తుతో ఐక్యపరచబడుతాము. నీకు నిత్యజీవము కలదా ? నీ పాపములకై యేసు యొక్క మరణము అను దేవుని బహుమానమును అంగీకరించుట వలన నీవు నిత్యజీవమును పొందగలవు. నీవు దానిని చేసినట్లైతే నిత్యజీవమును పొందగలవు.