మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి.
సిలువపై క్రీస్తు చేసిన కార్యము యొక్క నాల్గవ ఫలితం మనము క్రీస్తుతో లేపబడుట.
ఆయనను మృతులలోనుండి లేపిన
దేవుడు యేసును మృతులలోను౦డి లేపాడు కాబట్టి, క్రైస్తవునికి దేవుని ఎదుట తన స్థాన౦ ఉ౦దని హామీ ఉ౦ది. దేవుడు యేసుక్రీస్తు మృతులలో ను౦డి లేపగలిగితే ఆయన మనలను క్రొత్త జీవితమునకు పునరుధ్ధరింపగలడు.
దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వార
‘ ప్రభావమందు ‘ అనే పదానికి అర్థం క్రియాశీలక శక్తి (1:29; ఎఫ. 1:19; 3:7; 4:16). దేవుడు పునరుత్థాన శక్తి ద్వారా రక్షణ కార్యమును నెరవేర్చుతాడు. ఇది దేవుని గొప్ప కార్యము. దేవుడు పనికి పూనుకున్నప్పుడు, ఎప్పుడూ అద్భుతముగా చేస్తారు. ఇక్కడ దేవుని పని యేసు క్రీస్తును మృతులలోనుండి పునరుత్థానునిగా చేయుట. క్రైస్తవం అనేది ఒక తత్వశాస్త్రం లేదా, ఒక వ్యవస్థ లేదా జిమ్మిక్ కాదు. ఇది ఒక సజీవ క్రీస్తుతో ఒక సజీవ సంబంధం.
మనం చదువుతున్న వచనమునకు సమాంతర వచనం, ‘ కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. ‘ (రోమా. 6:4). ఈ వచనము కొలస్సీ 2:12 లోని విశయమునే బోధిస్తుంది.
దేవుడు విశ్వాసము ద్వారా మనలను లేవనెత్తును, భావోద్రేకాలవలన కాదు (II కొరిం. 5:7; ఎఫెస్సీ. 2:8, 9). వ్యక్తిగత ప్రయత్నం ద్వారా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం మానుకున్నాం. భగవంతుడి కృపను తప్ప మరి దీనినైనా విశ్వసించుట ఆపివేసాము. క్రీస్తు సంపూర్తిచేసిన కార్యమునందు విశ్వసించుట వలన దేవుడు మనలను క్రీస్తునందు గుర్తిస్తాడు.
ఆయనతోకూడ లేచితిరి
‘ఆయనతోకూడ లేచితిరి ‘ అనే మాట కలిపి లేపబడితిరి అని అర్ధము కలిగిఉంది. క్రీస్తు పునరుత్ధాన౦లో పాల్గొన్నాము అని దానర్థ౦. ఇది సహ-పునరుత్థానం. యేసు పునరుర్ధానుడైనప్పుడు ఆయనతో మనమును లేచాము. దేవుడు తన పునరుత్థానమ౦దు మనలను క్రీస్తు తో గుర్తిస్తున్నాడు. మనము ఆధ్యాత్మికంగా చనిపోయి ఉంటిమి కాని యేసు మనము మరల బ్రతకడానికి కారణమయ్యాడు.
నీటిలోకి ముంచబడుట క్రీస్తు యొక్క సమాధిని మరియు నీటి నుండి బయటకు వచ్చుట క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని చిత్రీకరిస్తుంది. అయితే, ఈ వచనము ఆధ్యాత్మిక పునరుత్థానముతో వ్యవహరిస్తో౦ది. దేవుడు మనలను క్రీస్తుతో పునరుత్థానులుగా నేడు పరములో మనలను గుర్తిస్తున్నాడు
నియమము:
విశ్వాసం అనేది మనం స్థాన సత్యాన్ని నిమగ్నం చేసే కార్యాచరణ సూత్రం.
అన్వయము:
దేవుని కార్యము మీద విశ్వాస౦ ద్వారా మన౦ క్రీస్తు మరణ, పునరుత్థానములాలో పాలు పొందుతాం. రక్షణ పొందిన మరుక్షణమే దేవుడు మనలను సజీవ రక్షకుని వద్దకు చేరాడు. అది మనము స్థానసత్యమును వ్యక్తిగతముగా అనుభవించినప్పుడు అది మనకు వాస్తవమవుతుంది. స్థానసత్యము కేవలము సిద్ధాంతముగా మిగిలితే మనకు కల్పించిన ఆధిక్యతల వలన మనము లాభము పొందము. డీప్ ఫ్రీజర్ నుంచి దాన్ని తీసి మన అనుభవానికి అన్వయించి చూసుకోవాలి.