మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో
శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును
తాను ఎప్పుడూ కలవని లేదా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించనివారిపట్ల పౌలు శ్రద్ధను కలిగిఉన్నాడు. అతను కొలోస్సే లేదా లావోడిసియాను ఎప్పుడూ సందర్శించలేదు. అతను వారి కోసం ప్రార్థించడం ద్వారా మరియు కొలొస్సయుల పత్రికను వ్రాయడం ద్వారా వారిపట్ల పౌలు శ్రద్ధను కలిగిఉన్నాడు.
నియమము:
క్రైస్తవులు తాము ఎప్పుడూ కలవని వారి గురించికూడా లోతుగా శ్రద్ధ వహిస్తారు.
అన్వయము:
మీరు ఎన్నడూ కలవని వ్యక్తుల గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నారా? మీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సంఘములను గురించి శ్రద్ధ వహిస్తున్నారా? మీరు సహవాసమును కొనసాగిస్తున్నారా? వ్యక్తిగత మద్దతు మరియు సమాచారం ద్వారా ఒకరికొకరు దూరములో ఉన్నాను సహవాసము చేయడం సాధ్యపడుతుంది. మన నుండి చాలా దూరంలో ఉన్న ఇతరుల కోసం మనం ప్రార్థించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయమున్న ఈ నాటి రోజులో, మనము వారిలో చాలా మందిని అతి తక్కువ సమయములో అనేకమందిని సంప్రదించవచ్చు.