వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
భద్రతావలయము యొక్క రెండవ వరుస క్రైస్తవులలో సన్నిహిత సహవాసం.
వారు ప్రేమయందు అతుకబడి
భద్రతావలయము యొక్క రెండవ వరుస అనగా, విశ్వాసులు దోషానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రేమలో కలిసిపోతారు. మనము దాడిలో ఎలా చేరాలో అనే విషయములో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు ప్రేమలో చేయి చేయి కలిపి ప్రభువును సేవించాలి. ప్రేమతో కూడిన ఐక్యత సాధారణ సత్యం నుండి వస్తుంది.
ప్రేమయందు అతుకబడుట సత్యంలో ప్రోత్సహించబడుట నుండి కలుగుతుందియని గ్రీకులోని పదము సూచిస్తుంది. క్రైస్తవులమధ్య ప్రేమ ఐక్యతతో నడుచుకుంటే తప్ప మనం అనుభవానికి సత్యాన్ని అనువర్తించలేము.
నియమము:
క్రైస్తవులలో సత్యంలో ప్రోత్సాహామునకు ముందు ప్రేమ ఉంటుంది.
అన్వయము:
ఇక్కడ “ప్రేమ” అనేది మాధుర్యం మరియు కాంతి కాదు. ఇది వ్యక్తిగత భావాలను మించిన ప్రేమ. ఈ ప్రేమ సందేశాన్ని అందించే వ్యక్తికి లేదా సందేశమును అందుకున్న వ్యక్తికి బాధ కలిగించునదైనను ఇతరులకు ఉత్తమమైనదాన్ని చేస్తుంది. ప్రేమ సత్యానికి అనుగుణంగా ఉంటుంది. మనం ప్రేమించేవారికి మనం చేయగలిగిన ఉత్తమమైన పని వారితో నిజాయితీగా ఉండటమే.