దేవుని వాక్యమును …సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని
1:24 మొదలుకొని అధ్యాయ౦ చివరి వరకు పౌలు తన పరిచర్యను సమర్పి౦చుకున్నాడు. “బాధలు”, “స౦తోషము” అనే రె౦డు పరస్పర విరుద్ధమైన భావోద్వేగాలను చెప్పిన తర్వాత ఆయన పరిచర్య స౦కల్పాన్ని ఇస్తున్నాడు.
మీ నిమిత్తము
ఈ మాట 24 వ వచనంలో సంఘమును సూచిస్తుంది. పౌలు సంఘమును చూసుకునే పరిచారకుడు అయ్యాడు. 23 వ వచనంలోని “వీటిలో” సువార్తను సూచిస్తుంది. మొదట ఆయన సువార్త పరిచారకుడు. ఇప్పుడు ఆయన సంఘమునకు పరిచారకుడు.
కొంతమంది కేవలం సువార్త పరిచారకులు కానీ సంఘ పరిచారకుడు కాదు. పరిచారకునికి సువార్త అనేది అనివార్యమైన విషయం కాని అది ఒక ఆరంభం మాత్రమే. పౌలు సువార్తలో నిపుణుడు (రోమా. 1:1; 15:16). సువార్త ప్రకటనా పని ను౦డి ఏదో ఒక ద్వితీయ సమస్య వరకు ఆయన ఎన్నడూ అడుగు పెట్టలేదు. మాధ్యమిక, అప్రధాన సమస్యలతో వ్యవహరి౦చడానికి సువార్త ప్రకటనా పనిని ఆయన ఎన్నడూ వాయిదా వేయలేదు. మంచీ, ఉత్తముము అనే తేడా ఆయనకు అర్థమైంది. పౌలు సువార్త పరిచారకుడు గా మాత్రమే కాక సంఘమునకు పరిచారకుడుగా ఉన్నాడు. ఈ ద్వంద్వ పరిచర్య పిల్లల నుండి పెద్దలను వేరుచేస్తుంది.
నియమము:
పరిచర్య డబుల్ బ్యారెల్ షోట్గన్ వంటిది: నశించిన వారికి మరియు క్రైస్తవులకు.
అన్వయము:
క్రీస్తు లేనివారికి ప్రత్యేకంగా పరిచర్య చేసే సంఘము సగం పరిచర్య మాత్రమే కలిగి ఉంది. సమతుల్య పరిచర్య ఇరువురికీ పరిచర్య చేస్తుంది.