మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు
ఈ వచనము పౌలు ప్రార్థన యొక్క మరొక దశను ప్రారంభిస్తుంది. కొలొస్సయుల కొరకు దేవుడు జోక్యం చేసుకోవాలని మొదటి పౌలు ప్రార్ధించాడు, ఇప్పుడు వారు క్రీస్తులో ప్రస్తుతము కలిగి ఉన్నదానికి తన కృతజ్ఞతలను తెలుపుచున్నాడు. మనకు అవసరమైన వాటికి మరియు క్రీస్తులో మనకు ఉన్న వాటికి గొప్ప వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోకపోతే అది చాలా విచారకరమైనదిగా ఉంటుంది.
మనలను పాత్రులనుగాచేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు
దేవుని చిత్తంలోకి ప్రవేశించే నాల్గవ ప్రభావం కృతజ్ఞత (I థెస్స 5:18; ఫిలి 4:6). పౌలు కొలొస్సయులను కృతజ్ఞతతో ఉండమని అడిగిన ఇతర సమయాలను గమనించండి (3:15-17; 4:2) . క్రీస్తులో మన ఆధీక్యతలకు మూలం అయినందున తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దేవుని కృప క్రీస్తులో విశ్వాసికి ఇప్పటికే అందించబడింది. “కృప” అనే పదం “ధన్యవాదాలు” అనే గ్రీకు పదం యొక్క మూలంలో ఉంది. స్వాస్ధ్యముగా పొందిన ప్రయోజనాలను మనం అనుభవిస్తే, దానిని సరఫరా చేసినందుకు దేవుడు మహిమను పొందాలి.
కృతజ్ఞత అనేది దేవుని ఏర్పాటులను అభినందించుట. కృతజ్ఞతలు చెల్లించుట అనేది దేవుని కృపను బట్టి సజీవంగా ఉన్న విశ్వాసి యొక్క లక్షణం. కృతజ్ఞతలు చెల్లించుట ఒక ప్రక్రియ. మనం ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పి ఆగిపోవాలని దేవుడు కోరుకోడు. మనము ప్రతిసమయములో కృతజ్ఞతలు చెప్పాలి (I థెస్స 5:18).
కృతజ్ఞతలు చెల్లించుట తండ్రికి సూచించబడిందని గమనించండి. కుమారుడైన దేవుడు మరియు పరిశుధ్ధాత్మ దేవుడు మధ్యవర్తులు. కృతజ్ఞతలు చెల్లించుట వారికి ఎప్పుడూ సూచించబడదు. మన అభ్యర్థనను ఏ విభాగానికి ఉంచాలో మనకు తెలిస్తే, మనము త్వరగా మన సమాధానం అందుకుంటాము. ఎవరిని సంబోధించాలో మనకు తెలిస్తే త్వరగానే సమాధానం వస్తుంది. మనము పరిశుద్ధాత్మలో కుమారుని ద్వారా తండ్రిని ప్రార్థిస్తాము.
నియమము:
మనము దేవుని కృపకు (దేవుని ఏర్పాటునుబట్టి) మళ్లించబడినట్లయితే, ప్రతి బాధ లేదా ప్రతికూల పరిస్థితులలో మనం కృతజ్ఞతలు తెలియజేయవచ్చు.
అన్వయము:
కష్టం మరియు శ్రమలో కృతజ్ఞతలు చెల్లించుట మన జీవితాల కోసం దేవుని చిత్తముమీద మనము ఆధారపడుతున్నాము. దీని అర్థం మనం మనల్ని శాశ్వతమైన వాటివైపు మాగుచూపుతున్నాము అని తాత్కాలికమైన వాటి వైపు కాదు.