Select Page
Read Introduction to James యాకోబు

 

సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడువరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా

 

యాకోబు ఇప్పుడు తీర్పు విషయం నుండి ఓపీక అను అంశానికి మారుతున్నాడు. అతని పాఠకులు ఆర్థిక దుర్వినియోగం నుండి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు, కాబట్టి అతను క్రీస్తు రాకదవరకు ఓపిక కలిగిఉండుమని చెబుతున్నాడు.

సహోదరులారా

“మీ యజమానులు మీకు చేసిన అన్యాయం కారణంగా, ఈ క్రింది ఆదేశాలను గమనించండి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. అన్యాయాన్ని పరిష్కరించడానికి దేవుని సూత్రాలపై పనిచేయండి. ”

ఓపిక కలిగి యుండుడి

ఆర్థిక పరిస్థితుల ద్వారా అణచివేతకు గురైనవారికి ఉద్దేశించిన నాలుగు ఆదేశాలలో మొదటిదానికి మేము ఇప్పుడు వచ్చాము

1) ఓపికపట్టండి ఎందుకంటే ప్రభువు అంతిమముగా మీ పరిస్థితులతో వ్యవహరిస్తాడు (5 :7),

 2) ప్రభువు యొక్క రాక కారణంగా మీ హృదయాలను స్థిరపర్చుకొనుడి (5:8),

 3) ఒకనిమీదనొకడు సణగకుడి, కానీ న్యాయాధిపతి వైపు చూడండి (5:9-11),

 4) మీరు చెప్పేదాని ద్వారా మీ యధార్ధతను కాపాడుకోండి (5:12). 

యాకోబు సహనంతో ఉన్న మూడు ఉదాహరణలు ఇస్తున్నాడు

1) తన పంట పరిపక్వత కోసం ఎదురుచూస్తున్న రైతు సహనం (5 7),

 2) హింసకు గురైన ప్రవక్తల సహనం (5 10) మరియు

 3) శ్రమలో యోబు సహనం (5 11). 

హింసలో సరైన వైఖరి మనకు అన్యాయం చేసేవారికి “సహనముగల” ధోరణి. “ఓపిక” ఉన్న వ్యక్తి దీర్ఘ సహనము, సులభముగా  కోపపడని వాడు అని అర్ధం. అతను ఇతరులను వారి దోషాలలో భరించగలడు.

“ఓపిక” అనేది రెచ్చగొట్టేటప్పుడు స్వీయ నిగ్రహము కలిగిన గుణం. ఈ లక్షణం ఉన్న వ్యక్తి ప్రతీకారం తీర్చుకోడు; తనకు చేసిన తప్పులకు ఇతరులను శిక్షించడు. ఇది కోపానికి వ్యతిరేకం. అతను కనికరము యొక్క ఒక భాగాన్ని కూడా కలిగి ఉంటాడు (నిర్గ 34:6; 1 పేతురు 3:20). దేవుడు కూడా తనను ఎదిరించడానికి మనుష్యులను అనుమతిస్తాడు (రోమా 2:4).

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు (1కొరిం 13:4)

 “ఓపిక” అనే మరో గ్రీకు పదం 1:3-4లో చూడగలము, ఇక్కడ క్లిష్ట పరిస్థితులను భరించాలనే భావన ఉంది. మనకు పరిస్థితులతో సహనం మరియు ప్రజలతో సహనం రెండూ అవసరం. వారి పరిస్థితి ఎంత కష్టమైనా, ప్రజలు మరియు పరిస్థితులతో అక్కడే ఓపికపట్టాలని యాకోబు తన పాఠకులను ప్రోత్సహిస్తున్నాడు. 

నియమము: 

ప్రజలతో ఓపిక కలిగిఉండుటకు మన ప్రోత్సాహం ఏమిటంటే, న్యాయాధిపతి వస్తారని మనకు తెలుసు.

అన్వయము:

మనకు ప్రజలతో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో,మరియు చివరకు, పనిలో ఓపిక అవసరం. ప్రతికూల పరిస్థితులను మన చేతుల్లోకి తీసుకోవడంగూర్చి మనం జాగ్రత్తగా ఉండాలి. మనము దానిని ప్రభువు చేతిలో వదిలివేయుటకు స్థలం ఉంది. 

యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము. (కీర్తనలు 37:7)

మనలో చాలా మంది త్వరగా కోపపడు స్వభావముగలవారు, సహనము ఉండదు. మనకు అన్యాయం చేసే వ్యక్తులపై మనం ఓపిక కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు. ఇతరులు మా స్థలాన్ని ఉల్లంఘించినప్పుడు మనము తొందరపడకూడదు. క్రిసోస్టోమ్ సహనాన్ని ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నను పూర్తిగా నిరాకరించు ఆత్మగా నిర్వచించాడు.

Share