సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుట అను సమస్యను సరిచేయడానికి, యాకోబు నాలుగు వర్గాలను పరిశీలించమని అడుగుతాడు
1) ఇతరులు,
2) ధర్మశాస్త్రము
3) దేవుడు మరియు
4) మనమే.
తన సహోదరునికి విరోధముగా మాటలాడి
“సోదరుడు” అనే పదానికి మూడు మార్లు ప్రాధాన్యతను గమనించండి. రోమన్ సామ్రాజ్యం అంతటా వ్యాపించిన యూద క్రైస్తవుల దృష్టిని క్రీస్తులో వారి కుటుంబ సంబంధాల వైపు ఆకర్షించడానికి యాకోబు ప్రయత్నిస్తున్నాడు. కుటుంబంలోని తోటి సభ్యుల నుండి అపవాదు ముఖ్యంగా వినాశకరమైనది.
నియమము:
క్రీస్తులో మన కుటుంబ సంబంధం గురించి సరైన దృక్పథం తోటి క్రైస్తవులను దుర్భాషలాడకుండా నిరోధించాలి.
అన్వయము:
క్రీస్తు శరీరానికి వెలుపల నుండి విరోధమైన మాటలు వినుట ఒక విషయం కాని సంఘము లోపల నుండి వినడం పూర్తిగా భిన్నమైన విషయం.
అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచు కొనుడి. (గలతీ 5:15)