కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత–దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది.
5 వ వచనంలోని మత్సరపడే వ్యక్తికి భిన్నంగా, యాకోబు ఇప్పుడు వినయపూర్వకమైన విశ్వాసిని దేవుడు ఎలా చూస్తాడో వివరిస్తున్నాడు. అహంకారం మరియు వినయం మధ్య చాలా తేడా ఉందని ఈ వచనము చూపిస్తుంది. యాకోబు దేవుని కృపకు మనిషి యొక్క మత్సరముకు గల వ్యత్యాసాని తెలుపుచున్నాడు.
కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును
“ఎక్కువ కృప” అనే పదాలు అక్షరాలా “గొప్ప కృప” అని. దేవుని కృప ఎల్లప్పుడూ అతని మునుపటి కృపను అధిగమిస్తుంది. దేవుడు కృప ఇస్తాడు కాని అధికమైన కృప ఇస్తాడు. “ఎక్కువ కృప” దేవుని కృప యొక్క పూర్తి సమర్ధతను సూచిస్తుంది. దేవుని సామర్థ్యంలో దేవుని కృప అంతులేనిది. దేవుని కృప ఎన్నటికీ తరిగిపోదు.
అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. (రోమా 5:20)
కృప అర్హతలేకున్న మేలుచేయుటకన్న గొప్పది. సిలువపై యేసుక్రీస్తు చేసిన బలియాగము ఆధారంగా దేవుడు మనకోసం చేయటానికి ఇష్టపడునది. దేవుడు తన కృపాను మన రక్షణకు పరిమితం చేయడు. మనకు రోజువారీ పాప క్షమాపణ అవసరము. మనకు రోజువారీ బలం అవసరం. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రతి అవసరానికి దేవుడు కృపను ఇస్తాడు.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. (హెబ్రీ 4:16)
“అనుగ్రహించును” అనే పదం దేవుడు నిరంతరం ఉచితంగా ఇస్తాడు అనే ఆలోచనను తెలియజేస్తుంది. కృప యొక్క అర్ధం ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనను కలిగి ఉంటుంది. దేవుని కృపను ఏదీ నిరోధించదు. తనకొరకు తాను పొందాలనుకునే ఏ విశ్వాసికి అయినా ఆయన పూర్తిగా మరియు స్వేచ్ఛగా ఇస్తాడు.
నియమము:
దేవుని కృపను మనం ఎన్నడూ ఖాళీ చేయలేము ఎందుకంటే ఆయన దానిని సమృద్ధిగా ఇస్తాడు.
అన్వయము:
దేవుని కృపను మనం ఎప్పటికీ ఖాళీ చేయలేము, ఎందుకంటే ఎల్లప్పుడూ అధికమైన కృప అనుగ్రహింపబడుతుంది. అనుగ్రహించుట దేవుని స్వభావము. దేవుడు గొప్ప ప్రదాత. మనం బలహీనంగా ఉన్నప్పుడు, అది మనకు కృప ఇవ్వడానికి దేవునికి అవకాశం – ఎక్కువ పాపమునకు ఎక్కువ, ఎక్కువ కృప. దీనికి విరుద్ధంగా, మనం స్వయంపైనే ఎంత ఎక్కువగా ఆధారపడతామో, దేవుని కృపాకు అంత తక్కువ లభ్యత ఉంటుంది.
అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.౹ 10నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. (2కొరిం 12:9,10)
దేవుని కృప యొక్క సంపూర్ణ వాగ్దానం వద్ద దేవుని పని ఆగిపోతుంది. ఆయన తన వాగ్దానాలను మన విశ్వాసంపై షరతులతో కూడినదిగా చేస్తాడు. ఆయన వాగ్దానాలు మన జీవితంలో అమలులోకి రావాలంటే విశ్వాసం ద్వారా మనం వాటిని వర్తింపజేయాలి. మన అనుభవానికి వర్తించకపోతే దేవుని కృప వలన మనకు ఏమి మేలు ?
దేవుని కృప దైవిక జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది. కృప ఇతరులపట్ల మనలో దయను ఉత్పత్తి చేస్తుంది. దేవుడు మనకు ఇస్తే, మనం ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడతాము.
ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై౹ మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను. (తీతుకు 2:11-14)