మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.
నరహత్యచేయుదురు
నిరాశపరిచబడిన కోరిక యొక్క చివరి పరిణామం “హత్య”. అక్షర హత్య కంటే ప్రాణాంతకమైన ద్వేషానికి అవకాశం ఉంది అను భావన. ఏదేమైనా, దురాశ అనేది విధ్వంసక ప్రవర్తనకు దారితీస్తుందనే ఆలోచన ఉంది. అబ్షాలోము తన తండ్రి దావీదును చంపడానికి ప్రయత్నించిన సంధర్భము దీనికి మంచి ఉదాహరణ (2 సమూ 15-17). ఊరియా భార్య బత్షెబాను ఆశించి దావీదు ఉరియాను చంపాడు. విశ్వాసులకు “నరహత్యచేయుదురు” అని యాకోబు స్పష్టంగా చెబుతున్నాడు.
మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. (1పేతురు 4:15)
మత్సర పడుదురు
ఇది 3:4 లో ఉన్న “కోరిక” కి వాడిన పదం కాదు. ఈ వచనములోని పదము యొక్క భావన వేరొకరికి చెందిన దేనిపైనా ఆశ కలిగిఉండుట. ఈ వ్యక్తి ఇలా చేస్తాడు ఎందుకంటే అతను తనను తాను వేరొకరి కంటే తక్కువగా భావించుకొని మరియు తనకు అది కావాలని ఆశిస్తాడు. అతను తదుపరి అడుగు వేస్తాడు మరియు అవతలి వ్యక్తిలో ఉన్నదాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తాడు.
గాని సంపాదించుకొనలేరు
“సంపాదించుకొనుట” అనే పదానికి అర్ధం, చేరుకోవడం, గురి కొట్టడం, ఒకరి ముగింపు పొందడం, విజయవంతం కావడం. ఆశించుట ఎప్పుడూ దాని లక్ష్యాన్ని చేరుకోదు. వేరొకరి గురించి చెడు భావన మన స్థానాన్ని ఏ విధంగానూ మెరుగుపరచదు.
నియమము:
ఇతరులను అణగదొక్కడం ద్వారా మనం ఉన్నత స్థానాన్ని పొందలేము.
అన్వయము:
కొంతమంది ఎప్పుడూ సంతృప్తి చెందరు. దేవుడు వారికి చంద్రుడిని ఇవ్వగలడు కాని వారు విసుగు చెందుతారు. మనకు కావలసినది మనకు లభించకపోతే, దాన్ని పొందడానికి మనము మన మార్గాన్ని ఏర్పాటు చేస్తాము. కొంతమంది డబ్బు కోసం ఎంతగా ఆశ కలిగిఉంటారంటే , దాని కోసం వారు చంపడానికైనా వెనుకాడరు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి భార్య కోసం ఆశిలో పడతాడు మరియు అది తన స్వంత భార్యను హత్య చేయడానికి అతన్ని ప్రేరేపిస్తుంది.
వేరొకరిని త్రోక్కివేయడం ద్వారా మనల్ని మనం పైకిరావచ్చని మనము భావిస్తాము. వేరొకరి వైఫల్యం మనాకు విజయాన్ని తెస్తుందని మనము నమ్ముతాము. ఎవరైనా సాధించినట్లయితే, అతని గురించి కొంత ప్రతికూల వ్యాఖ్య ద్వారా వారి సాధకమును కించపరుస్తాము. మన అసూయ మన తీర్పును నడిపిస్తుంది ఎందుకంటే ఎదుటివారి విజయంతో మనకు తగ్గుదల అనిపిస్తుంది. దురాశ అనేది ఇతరుల నుండి తప్పుకోవడం ద్వారా ఒకరి స్వంత అసమర్థతను దాచడానికి ప్రయత్నిస్తుంది.