Select Page
Read Introduction to James యాకోబు

 

అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.

 

ఈ వచనములో, యాకోబు మత్సరమును వివాదముగల మానవ జ్ఞానాన్ని మరియు జీవితంపై దైవిక దృక్పథానికి గల భేధాలను చూపుతున్నాడు. అతను దైవిక దృక్పథం యొక్క ఎనిమిది లక్షణాలను జాబితా చేయడం ప్రారంభించాడు.

అయితే

“అయితే” అనే పదం మానవ జ్ఞానాన్ని దేవుని జ్ఞానానికి భిన్నముగా చూపుతుంది. మానవ జ్ఞానం యొక్క మూర్ఖత్వం గురించి హెచ్చరించిన తరువాత, ఈ వచనములో యాకోబు పైనుండి వచ్చిన దేవుని జ్ఞానం యొక్క ప్రయోజనాలకు వెళతాడు (1:17).

పైనుండివచ్చు జ్ఞానము

పైనుండి వచ్చే జ్ఞానం దేవుని దృక్పథం. ఇది అనుభవాలకు దేవుని సూత్రాలను వర్తించే సామర్ధ్యం. దేవుడు ఈ జ్ఞానాన్ని ముఖ్యంగా తనతో నడిచే విశ్వాసులకు ఇస్తాడు. ఒక వ్యక్తి తన అనుభవానికి దేవుని దృక్పథాన్ని వర్తింపజేసినప్పుడు, అతను దేవుని జ్ఞానంతో పనిచేస్తాడు. అతనికి దేవునితో చిత్తశుద్ధి ఉంది.

ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు. (1కొరిం 1:24)

బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. (కొలస్సీ 2:3)

నియమము:

దేవుని జ్ఞానం ఒక దైవిక దానం మరియు మానవ సాధన ద్వారా పొందబడదు.

అన్వయము:

దేవుని జ్ఞానం మనకు దైవిక దానం ద్వారా వస్తుంది మరియు నా మానవ సాధన వలన కాదు. మనము దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, అది జీవితంపై భిన్నమైన దృక్పథాన్ని ఇస్తుంది – దైవిక దృక్పథం.

యెహోవాయే జ్ఞానమిచ్చువాడు; తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. (సామెతలు 2:6)

యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము; పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. (సామెతలు 9:10)

Share