ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.౹
ఈ వచనము దైవిక దృక్పథాన్ని మునుపటి రెండు వచనాల యొక్క మానవ దృక్పథం నుండి వేరు చేస్తుంది. బైబిల్ అనేది దేవుని నుండి మనకు వచ్చిన సందేశం. అక్కడ మనం దైవిక దృక్పథాన్ని కనుగొంటాము.
ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక
ఈ పత్రిక యొక్క పాఠకులు స్వీయ-కేంద్రీకృత జ్ఞానం (3 13,14) లో అతిశయించారు. ఈ జ్ఞానం పైనుండి కాదు క్రిందనుంది (భూమి మరియు దానిపై ఉన్న శక్తులు). మానవ జ్ఞానం దైవిక దృక్పథం కాదు, కేవలం మానవ దృక్పథం.
నియమము:
పరిణతి చెందిన క్రైస్తవుడు మానవ దృక్పథంలో కాకుండా దైవిక దృక్పథంలో పనిచేస్తాడు.
అన్వయము:
క్రైస్తవులు తమ క్రైస్తవ జీవితాలను నడిపించడానికి మానవ దృక్పథాన్ని ఉపయోగించుకునే ధోరణి మన రోజుల్లో ఉంది. ఇది ఘోరమైన తప్పు. దైవిక దృక్పథం లేకుండా [దేవుని వాక్య సూత్రాలను తెలుసుకోవడం మరియు మనిషి ఆలోచినకు భిన్నంగా అతను ఎలా ఆలోచిస్తాడు], మనం క్రైస్తవ జీవితాన్ని గడపలేము.
జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?౹ 21దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయెను. (1కొరిం 1:20,21)
ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనినయెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవునిదృష్టికి వెఱ్ఱితనమే. –జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;మరియు –జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియునుఅని వ్రాయబడియున్నది. కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి. పౌలైనను అపొల్లోయైనను, కేఫాయైనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు. (1కొరిం 3:18-23)