Select Page
Read Introduction to James యాకోబు

 

మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని

 

ఏడు వ వచనం అనియంత్రిత నాలుక యొక్క మూడవ దృష్టాంతాన్ని ఇస్తుంది.

మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు

 ‘జాతి’ అనే పదానికి స్వభావము అని అర్ధం. ఈ నాలుగు రకాల జాతుల సహజ గుణాలను మరియు లక్షణ స్వభావాన్ని మనుషులు మచ్చిక చేసుకోవచ్చు.

నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను

ఈ వచనములో యాకోబు ‘సాధు’ అనే పదాన్ని రెండుసార్లు ఉపయోగించాడు. అణచివేయడం, అరికట్టడం, నిరోధించడం లేదా నియంత్రించడం అనే భావము. మానవుడు క్రూరమైనవాటిని మొదలుకొని నుండి సాధు జంతువులవరకు అన్నిటిని మచ్చిక చేసుకోగలిగాడు. సర్కస్ లో మనుషులు సింహాలు మరియు ఏనుగులకు శిక్షణ ఇస్తారు. ప్రతి రకమైన జీవిని అరికట్టడం సాధ్యమే కాని నాలుకను అదుపులో ఉంచుకోవడం కష్టం. ఇది స్వాభావికంగా సరికానిది.

గాని

‘గాని’ అనే పదం ఆరు వ వచనాన్ని వివరిస్తుంది-నాలుక సహజసిద్దముగా సాదుకాజాలనిది, మొత్తం శరీరాన్ని అపవిత్రం చేస్తుంది. నాలుక మానవ నియంత్రణను ధిక్కరిస్తుంది మరియు దానిని నిరోధించడానికి దేవుని శక్తి అవసరం.

నియమము:

దేవుని శక్తి లేకుండా, నాలుక అంతర్గతంగా సరికానిది.

అన్వయము:

నాలుక అంతర్గతంగా అనియంత్రితమైనది. మన నోరు సహజంగా క్రమశిక్షణ లేనిది, అణచివేయలేనిది మరియు బాధ్యతారహితమైనది. అది నాలుక యొక్క ఆదిమ స్వభావం. బంధం మరియు నియమాలను విచ్ఛిన్నం చేస్తున్నందున నాలుకను నియంత్రించడము ఎంతో కృషితో కూడుకున్నది. మనం జంతు స్వభావాన్ని నియంత్రించగలం కాని దేవుని శక్తి ద్వారా తప్ప మానవ స్వభావాన్ని నియంత్రించలేము.

Share