Select Page
Read Introduction to James యాకోబు

 

నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

 

అది నరకముచేత చిచ్చు పెట్టబడును.

ఇక్కడ “నరకం” అనే పదం గెహెన్నా, యేసు నరకం కోసం ఎక్కువగా ఉపయోగించిన పదం. క్రొత్త నిబంధనలో ఈ పదాన్ని యేసు ఉపయోగించిన మీదట వెలుపల ఉపయోగించిన ఏకైక సంఘటన ఇది.

గెహెన్నా మొదట ఆగ్నేయంలో జెరూసలేం వెలుపల హిన్నోమ్ లోయలో చెత్త వేయు ప్రాంతము. వారు ఊహించదగిన ప్రతి రకమైన మలినాలను గెహెన్నాలో పడవేసేవారు. వారు చనిపోయిన జంతువులను మరియు సమాధిచేయబడని నేరస్థులను అక్కడ పడవేసేవారు. వారు అక్కడ పిల్లలను మోలోకు  దేవత పేరిట బలి ఇచ్చేవారు. ” నరకముచేత చిచ్చు పెట్టబడును ” అంటే సాతను నష్టాన్ని చేయడానికి నాలుకను ఉపయోగిస్తుంది అను భావము. .

పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది. (సామెతలు 16:27)

వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. (సామెతలు 26:21)

నియమము:

ఒక చెడు నాలుక నరకం నుండి దాని ప్రేరణను కనుగొంటుంది.

అన్వయము:

నాలుక ప్రజలను పాస్టర్ నుండి మరియు తల్లిదండ్రులను పిల్లల నుండి వేరు చేస్తుంది. ఆసక్తి కోసం విస్తరించిన కొద్దిగా అబద్దము లేదా పుకారు, అపారమైన నిష్పత్తితో పెరుగుతుంది. ఇది ఒక పుకారును ఉగ్రరూపం దాల్చినట్లుగా చేస్తుంది.

ప్రజలు ఆ తెలివితక్కువ వ్యాఖ్యను, ఆ బుద్ధిహీనమైన  మాటను ఎంచుకొని దానిని మరింత వక్రీకరణకు తీసుకువెళతారు. పుకారు ప్రాణము పోసుకుంటుంది. పలుకుబడి నాశనమవుతుంది మరియు ప్రజలు ఒకరికొకరు దూరం అవుతారు.

మన ఆయుధశాలలో మన దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటి మన నాలుక. అదంతా మన ఆత్మలో ఉన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అక్కడ మనకు ద్వేషము మరియు కోపం యొక్క వైఖరులు ఉంటే, మన నోటి నుండి తప్పు విషయాలు బయటకు వస్తాయి. ఇది చాలా విధ్వంసక పరికరం.

ఒక వ్యక్తి మట్టిని విసిరినప్పుడు, అతను ఈ ప్రక్రియలో తన చేతులను మురికి చేసుకుంటాడు.

Share