Select Page
Read Introduction to James యాకోబు

 

ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.

 

ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను

చాలా పెద్ద ఓడ గురించి మరొక దృష్టాంతాన్ని చూడమని యాకోబు తన పాఠకులను సవాలు చేస్తున్నాడు . పౌలు రోమాకు ప్రయాణించిన ఓడలో 276 మంది ఉన్నారు (అపో.కా. 27 :37), దాని అంత పరిమాణంలో ఉన్నది అని భావిద్దము. కెప్టెన్లు చాలా పెద్ద నౌకలను చాలా చిన్న చుక్కనుల ద్వారా ఎదురు గాలుల ద్వారా కూడా నడిపిస్తారు.

మునుపటి వచనములోని గుర్రము వలె, ఓడ మనిషికి ఉపమానముగా ఉంటుంది. ఓడ సముద్రప్రయాణములో ఉంది. భయంకరమైన తుఫానులో ఓడ యొక్క సమగ్రతను మనము చూదగలము. క్రైస్తవుడు తుఫానులో తన సామర్థ్యాన్ని ఉత్తమంగా పరీక్షించుకోగలడు. మనం క్రైస్తవులుగా మారిన క్షణం దేవుడు మనలను స్వర్గానికి పంపడు; జీవిత తుఫానుల ద్వారా ఆయన మనలను తగిన సమయములో పరీక్షిస్తాడు.

ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున

ఓడ నడుపువాడు నావికుడు. నాలుక జీవితం యొక్క దిశను మార్చగలదు. మన నాలుకను చూస్తుంటే, మన జీవితం తీసుకునే దిశను నిర్ణయించగలముము.

మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును

మొత్తం ఓడతో పోల్చితే చుక్కాని చాలా చిన్నది, అయితే ఇది ఓడ దిశకు మార్గనిర్దేశం చేస్తుంది.  గాలులకు ఓడను వదిలివేస్తే, మనము ఎప్పటికీ మన గమ్యాన్ని చేరుకోము. ఓడను సరిగ్గా నడిపించడానికి మనకు చుక్కాని అవసరం. చుక్కాని తుఫానులో ఓడను నడిపిస్తుంది. గాలులు మనల్ని ముందుకు నెట్టుతాయి, కాని మనము ఆ భయంకరమైన చర్యను చుక్కాని ద్వారా నియంత్రించగలము. చుక్కాని శపించడాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి అనుమతిస్తుంది. గాలి లేకుండా ప్రయాణించే ఓడలో కదలిక ఉండదు. క్రైస్తవుడు తన జీవితానికి దేవుని చుక్కాని ద్వారా సరైన దిశలో వెళ్ళడానికి జీవిత గాలులను ఉపయోగిస్తాడు.

నియమము:

మనము మన ఓడ యొక్క చుక్కానిని కలిగిఉన్నప్పుడు అనగా మన నాలుక యొక్క చుక్కాని నియంత్రణలో ఉన్నప్పుడు, ఇది జీవితం యొక్క ప్రమాదకర మార్గము నుండి నిర్దేశించబడిన మంచి మార్గములోనికి ప్రయాణము సాగుతుంది.

అన్వయము:

యేసు మన రక్షణకు నావికుడు. ఆయన జీవిత తుఫానులలో మనకు మార్గనిర్దేశం చేస్తాడు. మన జీవితాల అధిపతిగా ఉండటానికి ఆయనను అనుమతించినట్లయితే, మన జీవితాల కొరకు దేవుడు కలిగిఉన్న చిత్తాన్ని చేరుకుంటాము. తుఫానులు మన జీవితాలను తాకవచ్చు కాని తుఫానులను ఉపయోగించి మనల్ని ముందుకు సాగవచ్చు. దేవుడు మనలో ఎవరినీ జీవితంలో ఇబ్బందుల నుండి మినహాయించడు.

సమస్య మనకు ఇబ్బంది కలుగుతుందా అనేది కాదు, ఇబ్బందిని మనము ఎలా ఎదుర్కుంటాము అని. మన సమస్యలను మన నోటితో ఎదుర్కుంటే, దేవుడు మనకోసం నిర్దేశించిన ప్రయాణ మార్గమును మళ్లించే ప్రమాదం ఉంది. మన జీవితాల్లో అధికారంలో ఉన్న వ్యక్తికి మనల్ని మనం సమర్పించుకుంటే తప్ప మన నాలుకలు మనల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. దేవుని శక్తితో మన నాలుకను నియంత్రిస్తే, ఆయన మన ప్రయాణ మార్గమును సరళంగా ఉంచుతాడు.

Share