అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.
ఎవడైనను మాటయందు తప్పనియెడల
ఇప్పుడు యాకోబు తన విషయాన్ని బోధకుడు నుండి “ఎవడైనను” అని విస్తరిస్తున్నాడు. అతను ఒక నిర్దిష్ట పాపము గురించి చెప్తున్నాడు – నాలుక యొక్క పాపం. ఈ పాపం ప్రతి ఒక్కరినీ స్పష్టంగా కలిగి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సరైకానిదానిని చెప్పిఉంటాము. మనమందరం ఒకరిని బాధించాము.
మన ప్రసంగం మన పరిపక్వతకు సూచన. నాలుకను మచ్చిక చేసుకోవడం యాకోబు చెబుతున్న ముఖ్య విషయము (1:19, 26; 2:12; 3:5, 6 [రెండుసార్లు], 8; 4:11; 5 :12). మన మాటలు దేవునికి ముఖ్యమైనవి. మనలో కొందరు “మాటలో” పొరపాట్లు చేస్తాము.
మత్త 15 :19 దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును 20ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను
అట్టివాడు లోపము లేనివాడై
“లోపము లేనివాడై” అనే పదం పరిపక్వత యొక్క భావనను కలిగి ఉంది, పాపారహిత పరిపూర్ణత కాదు. నోటిని నియంత్రించగల వ్యక్తి పరిణతి చెందిన వ్యక్తి.
తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును
పరిణతి చెందిన వ్యక్తికి అతని ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి యొక్క స్వాభావిక శక్తిలో సామర్థ్యం ఉంటుంది. “సామర్థ్యం” అనే పదం భావన కంటే ఎక్కువ శక్తివంతమైనది, ఎందుకంటే దీని అర్థం బలమైన, శక్తివంతమైనది. పరిణతి చెందిన విశ్వాసి యేసుక్రీస్తు మహిమను, చైతన్యాన్ని శక్తివంతంగా ప్రతిబింబిస్తాడు.
“స్వాధీనమందుంచుకొన” అనగా నియంత్రణ. గుర్రం వంటి పెద్ద జీవిని మనం కళ్ళెము ద్వారా నియంత్రించగలుగుతాము. మనము దానిని కళ్ళెము ద్వారా నడిపించగలము, ఆపగలము. మన నాలుకను నియంత్రిచుకోగలిగితే, మనం దేనినైనా నియంత్రించగలము ఎందుకంటే మంచికైనా లేదా చెడుకైనా నాలుక గొప్ప శక్తి కలిగి ఉంది.
“ సర్వశరీరమును” అనే మాట బహుశా అతని దేహమును మొత్తం సూచిస్తాయి. మన నాలుకలను నియంత్రించడం నేర్చుకుంటే, మన జీవితమంతా నియంత్రించటం నేర్చుకోవచ్చు.
నియమము:
నాలుకను మచ్చిక చేసుకోవడం పరిపక్వతకు సంకేతం.
అన్వయము:
పరిపక్వతకు ఒక సంకేతం మచ్చిక చేసుకున్న నాలుక. దీనికి విపర్యం, నోటిని నియంత్రించలేని వ్యక్తి బహుశా తన జీవితాన్ని నియంత్రించలేడు. నాలుక శీలమును వెల్లడిస్తుంది. ఇది హృదయము యొక్క స్థితిని తెలిపే సంకేతం. మన ఆరోగ్యం యొక్క స్థితిని నిర్ణయించడానికి ఒక వైద్యుడు మన నాలుక వైపు చూసినట్లు, మన ఆధ్యాత్మిక ఆరోగ్యం యొక్క స్థితిని నిర్ణయించడానికి దేవుడు మన నాలుకలను చూస్తాడు.
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము. (కీర్తనలు 34:13)
నా నాలుకతో పాపముచేయకుండునట్లునా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని. (కీర్తనలు 39:1)
తోటి క్రైస్తవుల నుండి సెన్సార్షిప్ ప్రమాదం లేకుండా నాలుక యొక్క పాపాలు సంఘానికి వెళ్ళవచ్చు. మన మాటల ద్వారా మన విశ్వాసం యొక్క క్రియాశీలత చూడవచ్చు. పరిణతి చెందిన విశ్వాసి క్షేమాభివృద్ది గురించి, ఆరాధన మరియు నశించిన వాటిని రక్షణలోనికి నడిపించుటగురించి మాట్లాడుతాడు. శరీరసంబంధిగా ఉన్న క్రైస్తవుడు తన తోటి క్రైస్తవులనుగూర్చి నిరాశగా మాట్లాడుతాడు. కొంతమంది డంబాల కోసం జీవిస్తున్నారు. వారు చాలా అస్థిరంగా ఉంటారు ఎందుకంటే వారి నాలుకలు వారి ఆత్మలకు కట్టబడి ఉంటాయి.
నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును. (కీర్తనలు 35:28)
మనలో ఎవరూ పాప రహిత పరిపూర్ణతతో జీవించలేరు కాని మనం నాలుకను స్వాదీన పరచుకోగలము లేదా నాలుకయే మనలను స్వాదీన పరచుకొంటుంది.