Select Page
Read Introduction to James యాకోబు

 

నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

 

 మూడవ అధ్యాయముతో, యాకోబు ఒక కొత్త విషయానికి మారుతున్నాడు – నాలుకను నియంత్రించడం.  మన మాటలను ఎలా నియంత్రించుకుంటాం అనునది క్రైస్తవ జీవితములో పరిపక్వతకు ఒక మంచి కొలమానం.  హదయములో ఉన్నదానిని బట్టి నోరు మాటలాడుతుంది.  మొదటి 12 వచనాలు క్రైస్తవులు తమ మాటలను ఎలా అదుపు చేసుకోవాలో చూపిస్తున్నాయి.  క్రైస్తవ పని మాటల ద్వారా వస్తుంది.

నా సహోదరులారా,

యాకోబు తన వ్యాఖ్యలను విశ్వాసులను ఉద్దేశించి చేస్తున్నాడు. “నా సహోదరుల” అను మాట వాడకం ఒక కొత్త విషయానికి సూచిక.

మీలో అనేకులు బోధకులు కాకుండుడి.

” బోధకుడు” అనే పదాన్ని అధికారికంగా బోధించే వారు ఎవరైనా (అపో.కా. 13:1, 14, 15; 1 కొరిం 12:28; ఎఫె. 4:11).  ఒక వ్యవస్త (office) గొప్ప ఆధిక్యతతో పాటు గొప్ప బాధ్యతను కూడా కలిగి ఉంటుంది.  వారి బోధనగూర్చిన  బాధ్యత లేకుండా ప్రతిష్ఠను కోరుకునే వారు ఉన్నారు.  ఒక బోధనా పాత్ర గొప్ప గౌరవాన్ని కలిగించగలదు, అందుకే ఆ పాత్రను కొందరు కోరుకుంటారు.

–శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. 5మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. (మత్తయి 23:2-12)

” అనేకులు ” అనే పద౦, దేవుని వాక్యాన్ని బోధి౦చడానికి చాలామ౦ది అర్హులుకారని సూచిస్తో౦ది.  ఈ ఉదాత్తమైన కార్యాన్ని చేయడానికి కొద్దిమంది మాత్రమే సరిపోయారు. ఎందుకంటే దానికి 1) ఒక వరము, 2) దాన్ని చేయడంలో క్రమశిక్షణ, 3) దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరము.

బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని

దేవుని క్రమశిక్షణ ద్వారా భూమ్మీద ఉన్న తమ ప్రస్తుత జీవిత౦లో బోధకులు’ ‘ కఠినతీర్పును ‘ ఎదుర్కోవలసి ఉ౦టు౦ది, ఎ౦దుక౦టే వారు ఇతరులకు బోధి౦చడానికి దేవుడు వారిని ఉన్నతమైన ప్రమాణానికి ఎ౦చుతాడు.

దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.౹ 30మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. (అపో.కా 20:27-31)

గమనిక యాకోబు “మేము” అనే పదాన్ని తనలో చేర్చుకున్నాడు.  ఈ ఉన్నత ప్రమాణానికి దేవుడు అపొస్తలులను, నాయకులను కూడా ప్రస్తావిస్తున్నాడు.

అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలు కడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింపబడును. (2తిమో 2:15)

ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.(1తిమో 4:6,7)

నియమము:

దేవుని వాక్య౦లోని అనధికార బోధకులు ద్వంద్వ క్రమశిక్షణకు తమను తాము ఏర్పరచుకున్నారు.

అన్వయము:

బైబిలు బోధిస్తున్నది ఖచ్చిత౦గా తెలియజెప్పే గొప్ప బాధ్యతను దేవుని వాక్య బోధకులు తీసుకోవాలి.  అనేక తరాలపాటు క్రైస్తవత్వ౦ ఎదుర్కొన్న బైబిలు బోధలలో నేటి బోధలు సారాహీనమైన మరియు తప్పుడు బోధలుగా ఉన్నవి.

దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా, స౦పూర్ణ౦గా బోధి౦చడ౦ క్రైస్తవత్వానికి పునాది.  ఒక లోతైన బాధ్యతో, జాగ్రత్తగా అధ్యయన౦ చేయడ౦ ద్వారా మాత్రమే దేవుని వాక్యాన్ని ఖచ్చిత౦గా తెలియజేయలేము.  నేడు చాలామ౦ది, దేవుని మనస్సును మనుష్యుని మనస్సుకి తప్పుగా సూచిస్తు, బోధి౦చడానికి అనర్హులుగా ఉన్నారు.

తమ సొ౦త స౦కల్పాల కోస౦ బైబిలు బోధకుని బాధ్యతను ఉపయోగి౦చువారు తమ జీవితాల్లో దైవిక క్రమశిక్షణకు గురి అవుతారు. దేవుని వాక్యాన్ని నమ్మక౦గా బోధి౦చువారు, అలా చేసినందున, ప్రత్యేక ప్రతిఫల౦ పొ౦దుతారు.

Share