నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?
తన్ను ప్రేమించువారికి
“తన్ను ప్రేమించువారికి” అనగా తన కుమారుని యందు విశ్వాసముంచి నిత్యజీవమును పొందువారికి మాత్రమే దేవుని వాగ్ధానములు. వారు తన కుటుంబములోని వారు గనుక ఏర్పరచబడిన పేదవారిపై దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిఉన్నాడు.
తాను వాగ్దానము చేసిన
వాగ్ధానము అనగా, దేవుడు మనకు తాను చేయుబోవునది ముందుగా ప్రకటించునది. అది మన పట్ల నిబద్ధతతో దేవుడు చేయు బహిరంగమైన ధృడమైన మాట. నిత్యరాజ్యముకు వెళ్ళుచు, తన దేవుడు వాగ్ధానము చేసిన రాజ్యమునకు వారసులైన వారిని ఎలాగు తక్కువగా చూడగలము ? దేవుని వాగ్ధానములను ఎంతగా ఎత్తి పట్టుకుంటామో అంతగా ఆయన విశ్వాస్యాతను చూడగలము.
నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు (సామెతలు 8:17)
ఇందునుగూర్చి
దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. (1కొరిం 2:9)
ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు (1కొరిం 16:22)
నియమము:
దేవుని మాటను నమ్మి, ఆయన వాగ్ధానమును ఎత్తిపట్టువాడు ఆయన వాక్యమును ఘనపరచుచున్నడు.
అన్వయము:
మన పట్ల దేవుడు కలిగిఉన్న నిబద్దతను ఎత్తిపట్టుట క్రైస్తవుల బాధ్యత. విశ్వాసముతో దేవుని బ్యాంకు అకౌంటు నుండి మనము డ్రా చేసుకోవచ్చు. మనుషుల వాగ్దానలను నమ్మదగినవి కాకపోవచ్చు కానీ దేవుని వాగ్ధానములు. నమ్మదగినవి.
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు
ఆయన చెప్పి చేయకుండునా?
ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్య 23:19)
దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి (2కొరిం 1:20)