ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల౹
ఏలాగనగా
“ఏలాగనగా” అను మాట ముందు ఉన్న వచనముతో సంబంధమును కలిగి, పక్షపాతముకు అరికట్టుటను ఉదహరించుచున్నది.
యెడల
“యెడల” అను మాట సందేహాత్మకమైన సంధార్భమును తెలుపుచున్నది. క్రైస్తవుల సమాజమందిరములోనికి మిక్కిలి ధనవంతుడు ప్రవేశించినట్లు యాకోబు భావించుచున్నడు.
సమాజమందిరములోనికి వచ్చినప్పుడు
క్రైస్తవుల చేరికను “సమాజ మందిరముగా” యాకోబు పెర్కుంటున్నాడు. “సునగోగు” కు గ్రీకు భాషలో వాడు పదము. సునగోగు అనగా, కలసి వచ్చుట, కూడుకొనుట, ఆరాధించుటకు చేరుట. కొన్ని పర్యాయములు తర్జుమాచేయువారు ఈ పదమును “సంఘము”గా తర్జుమా చేశారు.
ప్రతి సబ్బాతున (శనివారము నాడు) యూదులు సంప్రదాయముగా ఆరాధించుటకు చేరెడివారు. పాలస్తీనా అంతటమాత్రమేగాక, రోమా సామ్రాజ్యమంతటా వారు సునగోగులు నిర్మించారు. క్రైస్తవులు యూదుల సునగోగులలో ఆరాధించేవారు. కొన్ని సంధార్భాలలో అది వారు చేరు, ఆరాధించుటకు కూడుకొను స్థలము. ఇక్కడ “సమాజమందిరము” అనగా భవనము కంటే క్రైస్తవుల కూటమి అని అనుకోవచ్చు.
బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు
బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వాడు తన గొప్పతనమును ప్రదర్శించును. “నాకు ఖరీదైన బట్టలున్నాయి. నేను భాగ్యవంతుడను.” ఆర్భాటము, ఆడంబరముతో ఉన్నత స్తాయిగల వ్యక్తి సంఘములోనికి వచ్చునట్లైతే, ఒక పేదరికములో ఉన్న వ్యక్తి కంటే అధికమైన గౌరవమును పొందకూడదు. అది సంఘము కొందరు సంపన్నులను కలిగి ఉండేది. (ఆపో. కా. 4:36,37; 8:27; 10:1,2; 16:14; 17:4; 1తిమో. 6:17-19).
మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల౹
“దరిద్రుడు” అనగా పేదరికములో ఉన్నవాడు. అతని వద్ద ధనము లేదు. బహుశా గృహము లేక వీదులలో నివసించుటచే బట్టలను ఉదుకుకొను అవకాశము లేనివాడైఉండవచ్చు. ఆహ్వానింపదగిన దగిన వ్యక్తి కాదు. సమాజములో అంగీకరమునకు నోచుకోనివాడు.
“మురికి బట్టలు” అనగా చింపిరి బట్టలు. చింపిరి బట్టలు కలిగిన పేదవాడైన వ్యక్తి క్రైస్తవుల సమజమందిరముకు వచ్చినప్పుడు మనము అడ్డుకోకూడదు. మొదటి శతాబ్దములో అనేక క్రైస్తవులు పేదరికములో ఉండేవారు. (ఆపో.కా. 2:45; 4:35–37; 6:1–6; 1కొరిం. 1:26; 2కొరిం. 8:2,14; గలతీ 2:10).
నియమము:
ప్రతీ క్రైస్తవుడు దేవుని దృష్టిలో, సాటి క్రైస్తవుని దృష్టిలో సమాన సాధారణాంశం కలిగిఉండాలి.
అన్వయము:
ఒక వ్యక్తి సంపన్నడు అన్న కారణముతో క్రైస్తవులు ఎక్కువగా లేక తక్కువగా చూడడం జరుగదు. ఆస్తి ఒక సమస్యకాదు. క్రైస్తవ ధృక్పధములో బట్టలు కాదు కానీ గుణము వ్యక్తిత్వాని నిర్ణయిస్తాయి.
వారి ఆస్తినిబట్టి, హొదానుబట్టి ధనవంతులతో సహవాసము చేయువారు, పేదవారైన క్రైస్తవులను విస్మరిస్తారు. వారి ఆర్ధిక స్తాయిని బట్టి వారిని తగ్గిస్తారు. ఐశ్వర్యవంతుడైన వానిపట్ల ప్రత్యేక శ్రద్ద చూపుట పేదవారిపై చిన్న చూపు చూడడమే. పేదవారికి తక్కువ స్ఠానము ఇస్తారు.
దీనిని బట్టి క్రైస్తవ సంఘము హోదాలకు స్థాయి కలిగించదు. తమను గొప్పచేసుకోడానికి ధనవంతులతో సహవాసముచేయువారు, అప్రయత్నపూర్వకముగా పేదవారిని తక్కువచ్చేసి చూస్తారు.
సరైన శుభ్రత, సరైన బట్టలు లేకుండా, మందిరానికి వచ్చు వారిపట్ల కించిత భావము కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నవా ? తమ సంఘమును ఒక మతసంబంధమైన కంట్రి క్లబ్బుగా చేస్కోవడం కొందరు క్రైస్తవులకు ఇష్టము. క్రైస్తవ సంఘములో హోదాలు, సాంఘికపరమైన వ్యత్యాసాలు ఉండకూడదు.