అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో
స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమముగా బైబిలును యాకోబు అభివర్ణిస్తున్నాడు. వాక్య నియమాలను మనము అనుసరిస్తే, వ్యక్తిగత స్వాతంత్రమును మనము అనుభవిస్తాము. పాపపు దాసత్వమునుండి విడిపించబడుతాము. బైబిలు స్వతంత్రత నిచ్చు గ్రంధము.
అందుకు యేసు–పాపముచేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతం త్రులైయుందురు. (యోహాను 8:34-36).
క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయెుక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. (రోమా 8:2-8).
ప్రభువే ఆత్మ. ప్రభువుయొక్క ఆత్మయెక్కడ నుండునో అక్కడ స్వాతంత్యమునుండును. మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. (2 కొరిం 3:17-18).
బైబిలులో దోషములు లేవు గనుక అది “సంపూర్ణమైనది”. వాస్తవిక దోషములు గాని వక్రీకరణకానీ లేవు. మానవుని పట్ల దేవుని ప్రణాళిక సంపూర్ణముగా బయలుపరుస్తుంది. వాస్తవికతను ఏ విధముగా నీరుగార్చనివ్వదు. మనము ఉన్నదానికంటే మెరుగైనవారిగా ఆలోచించి మనలను మనము మోసపుచ్చుకొనుటకు అవకాశము ఇవ్వదు.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది; అది ప్రాణమును తెప్పరిల్లజేయును
యెహోవా శాసనము నమ్మదగినది; అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. (కీర్తనలు 19:7).
నియమము:
అనుకూలతతో మనము దేవుని వాక్యానికి స్పందిస్తే, మనలను మనము మోసపుచ్చుకోనివ్వదు.
అన్వయము:
క్రైస్తవ జీవితము జీవించుటకు స్వాతంత్రమును దేవుని వాక్య నియమాలు మనకు ఇచ్చును. దేవుని ప్రేమించుటకు, సేవించుటకు, ఘనపరచుటకు మనకు స్వతంత్రతను ఇచ్చును. దైవిక నియమాలు లేకుండా దేవునివైపు మనలను త్రిప్పుకోలేము.
స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమము ద్వారా దేవుడు క్రైస్తవులను విడిపించును అనునది వాస్తవము. నవీన ఆలోచన విధానములో నియమము స్వాతంత్ర్యము ఒకదానికొకటికి వ్యతిరేకముగా అగుపిస్తాయి. ఒకరు ఒకే స మయములో స్వతంత్రులుగా మరియు నియమము క్రింద ఎలా ఉండగలరు? అలా ఎందుకంటే దేవుని నియమాలు ప్రతిపరిస్తితికి నిజమైఉన్నవి.
వివాహ నియమాలు అనుసరించుటద్వారా, వివాహ వ్యవస్థలో స్వతంత్రతనిస్తాయి. వ్యభిచారము వివాహమును ఉల్లంఘించుటయే. ఉల్లంఘించువానిని వ్యభిచారము దాసునిగా చేస్తుంది. మనము ఎంత ఎక్కువగా మన జీవితనికి గల దేవునిప్రణాళిక నియమాలకు ఎంత నమ్మకత్వముగా ఉంటే, మనము అంత గొప్ప ఆశీర్వాదలను అనుభవిస్తాము.
దేవుడు స్వతంత్రత నిచ్చుటకు తన నియమాలన్నిటిని ఏర్పరచును.
స్వతంత్రత, అనుమతి ఒకటి కాదు. దేవుని నియమాలోలో జీవించుటకు వాక్యపు స్వతంత్రత విడుదలనిస్తుంది.
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. ధర్మశాస్త్ర మంతయు–నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. (గలతీ 5:13-15).