ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.౹
అయితే,
ఈ వచనములో స్వీయ మోసముయొక్క ఆలోచనను చూడగలము (1:22)
ఎవ డైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే
దేవునివాక్యము వినుటకు గల కారణము, వాక్యప్రకారము జీవించుట. వాక్యము యొక్క గురి ప్రవర్తనలో పరివర్తన.
వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
అద్దము మన ముఖములోని మురికిని చూపిస్తుంది. మన ముఖమును కడుగుకొనుట ద్వారా దానిని సరిచేస్కోవచ్చు. దేవుని వాక్యమను అద్దములో చూచుకొని, ప్పపామును ఒప్పుకొనుట చేత మన ఆత్మను కడుగుకొనకపోతే, మన అనుభవాలకు దేవుని వాక్య నియమాలను అన్వయించుటలేదు.
నియమము:
దేవునివాక్యముతో మన జీవితము సరిగాకలిసి సహకరించకపోతే, దాని మార్పుపొందించు శక్తిని స్తానము తప్పించడమే.
అన్వయము:
దేవుని వాక్యము మన నిజ ఆత్మీయ స్థితిని చూచుకొనీకపోతే, దాని నియమాలలను మనము గ్రహించుటలో లేక దానిని అన్వయించుటలో లోపమున్నట్లు.
ముఖము పైన నల్లటి మరక్ను అద్దములో కనుగొని మనలో ఎంతమంది దానిని తుడుచుకోకుండా మందిరానికి వెళ్తారు ? అయిననూ ఆత్మీయంగా మనము ఆవిధముగా చేస్తాము. ఆత్మీయముగా మురికి ముఖములతో, దేవునితో సమన్వయ్ము తప్పిన జీవితములతో మనము తిరుగుతుంటాము.