అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల
భూమిపై మన కాలములో దేవునివాక్యమును మన జీవితమునకు అన్వయించినప్పుడు, మన ఆత్మలను దేవుని వాక్యము రక్షించగలదు. ఇక్కడ రక్షణ అనగా నిత్య రక్షణ కాదు కానీ మన క్రైస్తవ జీవితములను గూర్చినది. సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మానుటకు దేవుని వాక్యము మనకు సహాయము చేస్తుంది.
దేవునివాక్యనియమమును మన అనుభవాలకు అన్వయించితే, వినాశనమునుండి కాదుకాని దేవునితో మన నడకకు నష్టమునుండి కాపాడుతుంది. ఆత్మలు అనగా మన వ్యక్తిత్వాలు, భూమిపై మన సహజ జీవితమును సూచిస్తుంది.
నియమము:
దేవుడు రక్షింపబడిన ఆత్మలను రక్షించే పనిలో ఉన్నాడు.
అన్వయము:
పాపమును గుర్తించుట ఆత్మాశ్రయ వ్యక్తికి చాలా కష్టము. దేవుని వాక్యమును వారితో విశేషాత్మకముగా మాట్లాడనిచ్చు క్రైస్తవులు వారిజీవితములోని పాపమువిషయము వ్యవహరించి ఒప్పుకుంటారు.
దేవుడు రక్షింపబడిన ఆత్మను రక్షించు పనిలో ఉన్నాడు. రక్షణ మూడు రకములుగా ఉన్నది:
–ఆత్మ యొక్క ప్రారంభ రక్షణ
–క్రైస్తవ విశ్వాసి జీవితము యొక్క కొనసాగే రక్షణ
–పరలోకమునందు దేవుని సన్నిధిలో మనము ప్రవేశించునపుడు కలుగు ప్రాణాత్మదేహముల రక్షణ.
సరైన సమయములో దేవుని వాక్యమును మన ఆత్మలో నాటబడనిస్తే, క్రీస్తు స్వరూపములోనికి దేవుడు మనలను మార్చి, పరిపక్వత కలిగిస్తాడు. అనుదిన ప్రాతిపదికన మనము దేవుని వాక్యమును నేర్చుకుంటూ అన్వయించుకుంటే, దేవుడు దినదినము మరింత ఎక్కువగా జరుగనిస్తాడు.