అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
లోపల నాటబడిన… వాక్యమును
లోపల నాటబడిన అను మాట రెండు మాటల కలయిక : లోపల మరియు నాటబడుట. లోపల నాటబడుట అను భావన. లోపల నాటబడిన వాక్యము అనగా మన ఆత్మలో నాటబడిన దేవుని వాక్యము.
మన హృదాయామూలో దేవుని వాకమును నాటబడనిస్తే మనము శక్తివంతమైన క్రైస్తవులముగా ఉంటాము. ఎందుకంటే మానమెక్కడికి వెళ్ళినా, అంతర్లీనముగా కలుగచేయు గుణమును మనము కలిగి ఉండగలము. మన ఆత్మలో దేవుని వాక్యపు నియమములను అంగీకరించు వైఖరి కలిగిఉంటే అది మన ఆత్మలను అది రక్షిస్తుంది.
మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను. (మత్తయి 13:23).
నియమము:
మన హృదయములో దేవుని వాక్యము నాటబడనిస్తే, మన అనుదిన జీవిత నియమ నిబంధనల్లో అది భాగమైపోతుంది.
అన్వయము:
దేవుని వాక్యము మన ఆత్మలో నాటబడి మన ప్రవర్తనలో వేరుతన్ను విత్తనము వలె ఉండాలి.
వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. (అపో.కా. 17:11).
కాబట్టి అవిధే యతవలనవారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.(హెబ్రీ 4:11-13).
మన ఆత్మలను పాపమునిండి విడిపించుటకు మనము చేయవలసిన రెండు విషయాలు : 1) పాపపు మలిన వస్త్రములను తీసివేయుట మరియు 2) మన ఆత్మలోనికి దేవుని వాక్యమును ఆహ్వానించుట.మనము ఒకటి చేసి మరొకటి చేయక పోతే, మనము తప్పిపోతాము. మన పాపములను ఒప్పుకుంటే చాలదు, మన పాపములతో వ్యవహరించుటలో ఏర్పడిన శూన్యము నింపబడుటకు మనము దేవుని వాక్యమును అంగీకరించాలి.
శూన్యము ఎప్పుడూ తనవైపు ఏదోకదానిని తనవైపు తీసుకుంటుంది. అందుకే మనము దేవుని వాక్యమును అంగీకరించకుండ కేవలము పాపమును ఒప్పుకుంటే, పాపము మన ఆత్మలోనికి ప్రతిసారి తిరిగి వస్తుంది. మనపాపమునకు బదులుగా దేవుని వాక్యమును ఉంచితే, పాపమును ఎదుర్కొనుటకు మనకు బలమైన పునాది ఉంటుంది.