ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
ఎందుకనగా నరుని కోపము
ఇక్కడ “కోపము” అను మాట పైన వచనములోని మాటయే. ఒకరిమీద ద్వేషం ఉంచుకొని కోపముతో మండిపోవడము. “నరుడు” అను మాట మనుష్యుడు అని.
మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునేయుండును. (సామెతలు 19:19).
దేవుని నీతిని నెరవేర్చదు.
మనుషుని కోపము క్రియాశీల క్రైస్తవ జీవితాన్ని కలిగించలేదు. నరుని కోపమునకు దేవుని నీటికి వ్యత్యాసము ఉన్నది. దేవుని న్యాయవిధానములో పాపసహితమైన కోపము పనిచేయదు. పాపము చేయకుండా ఒకరిమీద కోపముకలిగిఉండే అవకాశము ఉన్నది.
విషయాతీత కోపము అన్యాయము మీద దేవుడు కలిగిఉన్న కోపము వంటిది. ఇతరులు పీడింపబడుతున్నపుడు మనము కోపపాడుతా సరైనదే, విషయాత్మకమైన కోపానికి మనము లోనైతే, దయ్యనికి మనము మన జీవితములో పట్టును కల్పించినట్లే.
కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీకోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి; (ఎఫెస్సీ 4:26-27).
నియమము:
విషయాత్మక కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
అన్వయము:
మన హృదయములో కొపము మండుచూ దేవునితో నడువలేము. మన కోపము సరైనదైతే కోపముకలిగి దేవునితో నడువగలము. దేవుడు అన్యాయాన్ని తట్టుకోలేడు, అదేవిధముగా క్రైస్తవుడుకూడా.
కొన్ని సార్లు విషయాతీత, విషయసంబంధ కోపముమధ్య సూక్స్మమైన బేధము ఉంటుంది. కోపములో మనము మునిగిఉంటే మంగురించి మనము తెల్సుకొనిఉండాలి. మన , విషయసంబంధ కోపము న్యాయపరమైనదేనని మనకు మనము సమర్ధించుకుంటాము. తన భార్య మీద ఉన్న తన కోపము సరియే అని భర్త అనుకొనవచ్చు మరియు భార్య తన కోపము న్యాయమే అని అనుకొనవచ్చు కానీ వారు ఇరువురు పరస్పరము విషయసంబంధ కోపము కలిగిఉన్నారు.
న్యాయపరమైన కోపము ఎక్కువ కాలము కలిగి ఉండవచ్చు. న్యాయపరమైన కోపము క్రోధముగా అగునట్లు చేస్తే న్యాయముకాని కోపముగా మారుతుంది. ఇది కూడా దేవుని నీతిని నెరవేర్చదు.