ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.
సత్యవాక్యమువలన
మనము తిరిగిజన్మించుటకు దేవుడు ఉపయోగించు సాధనము సత్యవాక్యము (దేవుని వాక్యము మరియు సువార్త)
నియమము:
సువార్త వర్తమానమును ప్రకటించుటకు బైబిలు సరియైన మాధ్యమము.
అన్వయము:
అబద్దమైన భాగము లేదా విషయము లేఖనాలలో లేదు. అపవాది అబద్దమును బైబిలు ఖచ్చితముగా నమోదు చేసింది. అపవాది అబద్దము అసత్యము కానీ దానిని గూర్చి చేయబడిన ఖచ్చితమైన నమోదు సత్యము. పరిశుద్ధాత్మదేవుడు తన నడిపింపు ద్వారా మానవ రచయితల వాక్య భాగాలను వ్రాయుచుండగా, ఆయన వ్రాశాడు గనుక మనము బైబిల్ మొత్తాన్ని నమ్మవచ్చు.
ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. (రోమా 3:4).
“ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. (1 థెస్స 2:13).
బైబిల్ మార్పుచెందని దేవుని సత్యము గనుక, దేవుని గురించి సత్యములను ప్రకటించుటకు అది అత్యంత ఉన్నత వాహకము. భోధన, నటన దేవుని సత్యమును ప్రకటించుటకు మంచి విధానాలు కానీ అవి దేవుని వాక్యానికి సరితూగవు.