Select Page
Read Introduction to James యాకోబు

 

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

దేవుడు మొదట సంకల్పిస్తాడు ఆతరువాత కార్యము చేస్తాడు. దేవుడు మన రక్షణను సంకల్పించినప్పటి నుండి మనలను తన రాజ్యమునకు తెచ్చుటకు వాక్యసత్యమును వినియోగించాడు.

మనలను … కనెను.

 “కనెను” అనుమాట “గర్భము  ధరించుట” అను మాట నుండి వస్తుంది. గర్భము నుండి బయిటకు తెచ్చుట లేక జన్మ నిచ్చుట అను భావము (1:15) దేవుడు సత్యవాక్యము ద్వారా మనలను నూతన జీవిత స్తితి లోనికి తెచ్చును. పాపము మరణమును కంటుంది, దేవుడు  నిత్యజీవమును తెచ్చును. ఇదే క్రొత్త జన్మము.

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.౹ 13వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.  (యోహాను 1:12,13)

అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. (యోహాను 3:3, 7-8).

మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు (1 పేతురు 1:22).

 “నూతన జన్మ” అను మాట క్రొత్త నిబంధనలో రెండు మారులు మాత్రమే కనిపిస్తుంది :

“యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్తయి 19:28).

మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. (తీతు 3:4-7).

నియమము:

నిత్యరక్షణకు రెండవ ఆత్మీయ జన్మము అవసరము.

అన్వయము:

ఎవరైనను దేవుని పరలోకములోనికి ప్రవేశింపకముందు, తన పాపములు క్షమించబడుటకు విశ్వాసముతో క్రీస్తు మరణమును హత్తుకోవాలి. ఒకమారు దానిని చేసినట్లైతే విశ్వాసముద్వారా వెంటనే నిత్యజీవములోనికి ప్రవేశిస్తాడు.

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. (యోహాను 5:24).

నిత్యజీవము రక్షణపొందు సమయములోనే ప్రారంభమౌతుంది, మరణము వద్ద కాదు. మనము దేవుని వాగ్ధానమును విశ్వసించిన క్షణములోనే ఆయన మనలను నిత్యజీవములోనికి నడిపిస్తాడు.

Share