Select Page
Read Introduction to James యాకోబు

 

ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను.

 

తన సంకల్ప ప్రకారము

మూలభాషలో “తన సంకల్ప ప్రకారము” నొక్కిచెప్పబడింది. “సంకల్పము” అను మాట “ఆలోచన” అను భావము  కలిగిఉంది. మానవలిపాపములో పడిపోతే తను ఏయమిచ్చేయనైఉన్నాడో దానిగూర్చి  తనలోతాను సమాలోచన చేసుకున్నాడు. తనకు తాను ఆలోచించుకొనిన పహాలితముగా తన కుమారుని యందు విశ్వసించువారి రెండవ జన్మము గూర్చ నిర్ణయింపబడినది. వారికి రెండవ జన్మను ఇస్తాడు.

తిరిగిజన్మించుట దేవుని కార్యము, మానవుల కార్యము కాదు. దేవుని చిత్తము ద్వారా తిరిగి జన్మించిన వారు దేవుని రాజ్యములోనికి వస్తారు; ఇది చపలమైన కార్యము కాదు. నిత్యత్వమునుండి ఇలా జరగాలని దేవుడు నిశ్చయించాడు. తమ కేవలము స్వచిత్తముద్వారా దేవుని వద్దకు రాలేరు. క్రైస్తవులుగా అగుటకు దేవుని సార్వభౌమ జోక్యము వారికి అవసరము. దేవుడు తిరిగి జన్మించుటను ప్రారంభిస్తాడు.

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (యోహాను 1:12).

స్వతంత్రముగా దేవునివద్దకు వచ్చుటకు మానవులకు సామర్ధ్యము లేదు. దేవుడు మొదటిగా ఆ సామర్ధ్యమును మనకు ఇవ్వవలసిన అవసరము ఉన్నది.

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. (1 కొరిం 2:14).

నియమము:

దేవుడు విశ్వమును తన సంకల్పము ద్వారా క్రమపర్చాడు కనుక సృష్టిలో జగత్తు ఉన్నది (క్రమము) , గందరగోళము లేదు.

అన్వయము:

తన సృష్టములో కొందరిని రక్షింపవలెనని దేవుడు సంకల్పించకుండా ఉంటే, రక్షణ ఉండేదికాదు. అందరూ మారుమనసు పొందవలెనని దేవుని సంకల్పం, కానీ అందరూ అలా చేయరు (2పేతురు 3:9). మనకు ఈ విషయములో ఎంచుకునే  వీలు ఉంది అని సూచిస్తుంది.

దేవుడు తన సంకల్పముప్రకారము విశ్వమును పాలించక పోతే సృష్టి నిలకడలేనిదిగా, గందరగోళముగా ఉండేది. విశ్వముపై దేవుని సార్వభౌమ ఉపగమనములో , సృష్టి యొక్క పర్యవసానాలు గురించి  తార్కికముగా తలంచాడు.

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. (ఎఫెస్సీ 1:3-6).

Share