Select Page
Read Introduction to James యాకోబు

 

దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.

 

15వ వచనములో యాకోబు సాదృశ్యమును శిశుజననమునాకు మార్చుతున్నాడు. పాపము యొక్క ఫలమును ఈ వచనము తెలుపుతుంది.

దురాశ గర్భము ధరించి

 “గర్భము ధరించి” అను పదము అర్ధము కలసి తీసుకొనుట. లైంగిక పరముగా గర్భము చేయు అను భావన.

శోధనకు విశ్వాసి అవకాశము ఇచ్చినప్పుడు,  పాపము కార్యరూపము దాల్చుటకు స్తావరము ఏర్పరచుకుంటుంది. శోధన పాపముగా పరిణమిస్తుంది. 

పాపమును కనగా

దురాశ పాపముకు జన్మనిస్తుంది. స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన విధంగా దురాశ పాపమునకు జన్మనిస్తుంది. పాపము ఇప్పుడు పిండము దశలో ఉన్నది.

నియమము:

శోధన సమయములో మనము ప్రభావవంతముగా పాపముతో వ్యవహరిస్తాము.

అన్వయము:

దురాశకలిగిన ఆలోచనలో ఎంతో శక్తి ఉంది. శోధన సమయములోనే క్రైస్తవుడు పాపముతో వ్యవహరించాలి, పాపము చేయుటకు మనము ఎంచుకున్నప్పుడు కాదు.

మనమెవరము శోధనను నివారించలేము. శోధింపబడుట పాపము కాదు కానీ శోధనకు లొంగుట పాపము. రాక్శకుని మనము కలుసుకునేంతవరకు మన మనసులో దుష్ట ఆలోచనలు పుడ్తుంటాయి.

ప్రస్తుత దినాల్లో విశ్వాసికి ఇంటర్నెట్, సినిమాలు, టీ.వీ. గొప్ప శోధనను కలిగిస్తున్నాయి. ఈ వాహకాలద్వారా దురాశ మన మనసులను దాడి చేస్తుంది. అనుకోని విధముగా అకస్మాత్తుగా  అది వస్తుంది. అందుకే మన మనసును శోధనుండి కాపాడుకోడానికి మొదట దేవుని వాక్యముతో మన మనసును సిద్దముచేసుకోవాలి

మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. (యాకోబు  1:22).

మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవి ధేయతకు ప్రతిదండనచేయ సిద్ధపడి యున్నాము. (2 కొరిం 10:4-6).

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; (కొలస్సీ 3:2).

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. (కొలస్సీ  3:16).

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (రోమా 12:2).

Share