ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.
మరులుకొల్పబడినవాడై
మనలో శోధనలకు రెండు మూలాలు కలవు – లోపలినుండి, బయటినుండి. మొదటి శోధన ఆంతర్యమునుండి వస్తుంది మరియు దాని మూలము పాపప్రభావములో కలిగిఉంది”ఈడ్వబడి” . రెండవదిగా, మనలను క్రింద పడవేసే బాహ్య ఆకర్షణ కలదు – “మరులుకొల్పబడి”మన పాపస్వభావము మన ఆంతర్య శత్రువు, అపవాది మన బాహ్య శత్రువు. మనము ఎప్పుడూ ఇద్దరు శత్రువులను ఎదుర్కుంతాము, అందుకనే మనము పడిపోకుండా జాగ్రతపడాలి. మన పాపనైజము యొక్క సహకారము లేకుండా సాతాను మనలను మరులుకొల్పలేడు.
“మరులుకొల్పబడి” అనగా ఒక చేపను ఎరవేసి ఆకర్షించడము. చేపను ఆకర్షించుటకు మత్స్యకారుడు ఎలాఅయితే మరులుకొల్పుతాడో, ఆశనిగ్రహము నుండి మన దురాశ మనలను మరులుకొల్పుతుంది. మన చీకటి వైపుకు ఆశకలిగించేవిధముగా శోధన గాలము వేసి ఎరతో ఆకర్షిస్తుంది. పాపము చాలా ఆకర్షణీయముగా అగుపడుతుంది కానీ అంతిమముగా దానికి దాసోహమైపోతాము. ఎర చాలా ఆకాశవంతంగా ఉన్నప్పటికి దానిని మ్రింగితే ఎంత ప్రమాదమో మనకు తెలుసు.
శోధనకు లోబడకుండా జ్ఞానము మనలను ఆపదు. శోధన మన జ్ఞానము కన్నా శక్తివంతమైనది. పాపము మనము అనుకోనివిధముగా మనలను జయిస్తుంది. (గల 6:1) అనగా మనకు మనగురించి తగినంతగా, మరియు మనలో ఉన్న సామర్ధ్యాల గురించి తెలియదు.
“మరులుకొల్పబడిన” అను మాటను పేతురు “వ్యభికారము తో నిండిన కన్నులు “ కలిగి “శరీర ఇచ్చలతో” పనిచేయు వారికి ఉపయోగించాడు.
వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకముచేయబడిన హృదయముగలవారును, శాపగ్రస్తులునైయుండి,…
వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు (2 పేతురు 2:14,18).
నియమము:
పాపపు ప్రబావముకు సాతాను గాలము వంటివాడు.
అన్వయము:
మనము ఉచ్చును పెడతాము మరియు పాపపు ఉచ్చులో చిక్కుకుంటాము. మొదట మన దురాశ దేవునినుండి దూరం చేస్తుంది, ఆతర్వాత సాతాను పాపమునకు కలిగించే ఆకర్షణలకు లొంగిపోతాము. పాపముతో వ్యవహరించునప్పుడు రెండు స్థాయిలలో దానిని చూడవచ్చు:
—పాపమును విడుచుట
—దేవునితో సహవాసమును హత్తుకొనుట.
అంతిమముగా, మన పాపమునకు దేవుని నిందించలేము అపవాదిని నిందించలేము; మనలనుమనమే నిందించుకోవాలి.
భాదితుడు మానసికముగా ఎల్లప్పుడు నిందను ఇతరవాటిమీదగాని ఇతరులమీదగాని నెడ్తాడు .