Select Page
Read Introduction to James యాకోబు

 

ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును.

 

మన పాపముకు దేవుని మీద నిందమోపుటకంటే (13వ .) మననుండే హాపము మొదలౌతుంది అనే వాస్తవాన్ని మనమెదుర్కోవాలి.

ప్రతివాడును… శోధింపబడును.

శోధన మననుండే వస్తుంది కానీ దేవుని నుండి కాదు. మన వాంఛలు మ్యాన్లను నడిపించి మరులుకొల్పినప్పుడు శోధన వస్తుంది. దానిలో ఉత్ప్రేరకము లేకుండా ఏ శోధన ఉండదు.

కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను. (రోమా 7:17-25).

“శోదింపబడును” అనుదానికి మూలభాషలో పునరావృతమైన శోధనలు అని. రక్షకుని ముఖాముఖిగా కలుసుకునేవరకు పాపముపై సంపూర్ణ విజయము లేదు.

శోధనకు ద్వయ మూలాలు:

–లోపలినుండి

–బయటినుండి

శోధన రెండూ అంతర్గము, బాహ్యమూ. అంతర్గతముగా శోధన వచ్చినప్పుడు అది పాపేచ్చ ; శోధన బయట నుండి వచ్చినప్పుడు అది మరులుకొల్పు.

వీటిలో ప్రతిదీ శోధన యొక్క సార్వజనీనతను సూచిస్తుంది. ఎవరు నోరోధకులో కారు మరియు మింహాయింపులు లేవు.

ఈడ్వబడి

క్రైస్తవులమైనప్పుడు దేవుడు మన పాపపు సామర్ధ్యము పనిచేయకుండా చేయలేదు. అది మన రక్షకుని ముఖాముఖిగా కలుసుకున్నపుడు జరుగుతుంది.  మొదట శోధన లోపలినిండి వస్తుంది – “స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి”. శోధనపట్ల కోరిక, సామర్ధ్యము మనకు లేనప్పుడు మనము శోధనలో పడిపోము. లోపలి కోరిక పాపములోనికి నడిపిస్తుంది.

న్యాయపరముగా యేసు శిలువలో దానిని ఓడించాడు కానీ ఆయనను పరలోకములో కలుసుకున్నప్పుడు ఉనికిలో ఉండకుండా దానిని తుడిచివేస్తాడు.

 “ఈడ్వబడి” అనగా లాగబడి. మూలభాషలో ఉచ్చులలోకి జంతువులను ఇరికించుటకు ఉపయోగిస్తారు. దురాశవలన ఒక ప్రమాణము నుండి లాగివేయబడుట అని భావన. శోధన మనలను మన స్వకీయ కొరికాలచేత ఉచ్చులో ఉంచుతుంది.

తన స్వకీయమైన దురాశచేత

 “చేత” అనేది మూలభాషలో పాపమునకు అసలైన మూలము (కారకము)ను సూచిస్తుంది. పాపానికి కారణము మన హృదయ్ములోనే ఉన్నది – మన పాపము సామర్ధ్యములోనే. ఒక ఆకర్షణీయమైన స్త్రీ ఒక పురుషుని మరులుకొల్పినట్లు (విపర్యంగా), అదేవిధముగా మన పాపము యొక్క ప్రభావము దేవుని ప్రేమించకుండా, తనతో సన్నిహిత సంబంధము కలిగి ఉండకుండా చేస్తుంది. మన కోరికలు మనలను పట్టి వాటిలో బంధించి ఉంచుతాయి.

 “స్వకీయ” అనే మాట ప్రతి వ్యక్తిలో దురాశ స్వభావ ప్రతిరూపం వివిధముగా ఉంటుంది అని సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క దురాశ మరొకరి ప్రతికూలత. మనలో కొందరు హోమోసెక్సువాలిటీకి

శోధింపబడరు ఎందుకంటే అది మనకు వికర్షకము, కానీ ఇతరులు దానిని నిజమైన శోధనగా ఎదుర్కుంటారు.  

 “దురాశ” అను పదము బలమైన వ్యామోహమును సూచిస్తుంది. శోధన ప్రధానముగా లోపలఉన్న మోసకారి నుండి వస్తుంది, అపవాడినుండో లేక పరిస్తితులనుండో కాదు. “నేను శత్రువును కలిసాను అది నేనే”.

నియమము:

పాపము హృదయములోనే మొదలౌతుంది.

అన్వయము:

పాపము హృదయములోనే మొదలౌతుంది. శోధనకు అసలైన మూలము మనమే – మన పాపపు ప్రభావము. క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా ప్రతిఒక్కరు చెడు చేయుటకు బుద్ది, సామర్ధ్యం కలిగిఉన్నారు.

నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. (కీర్తనలు 51:5).

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? ( యిర్మియా 17: 9)

మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. (1 యోహాను  1:8).

మనము దానికి అవకాశము ఇస్తే మనలను క్రిందకు గుంజే ధౌర్భాగ్యము ఉన్నది. మనము దానిని వదిలితే మనమీద ఇంకా ఎక్కువ నియంత్రణ సాధించే  ఒత్తిడులు పెరుగుతాయి. పాపము ఎప్పుడూ ఆకర్షణీయము, ఆనందింపదగినది మరియు శక్తివంతమైనది. మనము పాపమునకు మూల్యం చెల్లిస్తాము గనుక అది మనలను మోసం చేస్తుంది.

Share