Select Page
Read Introduction to James యాకోబు

 

దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.

 

దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు

దేనిచేతగాని ఎవరిచేతగాని శోధింపబడుటకు దేవుడు  సమర్ధుడు కాడు. ఆయన స్వభావికముగా పరిపూర్ణుడు కనుక ఆయన శోధింపబడనేరాడు. దేవుని సామర్ధ్యములో పాపము సమ్మతిపరచలేదు. పాపముచేయుటకు దేవునిలో దుర్బలత లేదు.

ఆది 22:1లో దేవుడు అబ్రహామును పరిశోదించేను అని చెబుతుంది. ఇక్కడ పరిశోధన అనగా నిరూపణ అంతే కానీ శోధన కాదు.

ఏవిషయములో దేవుని మనము నేరారోపణ చేయలేము. దుష్టత్వముతో ఏకీభవించే శక్తినుండి దేవుడు సంపూర్ణముగా స్వతంత్రుడుగా ఉండుటను బట్టి, ఇతరులను శోదించు అవకాశములో ఆయన లేడు.

ఆయన ఎవనిని శోధింపడు

దేవుడు ప్రత్యక్షముగా ఎవరిని శోధించాడు కానీ మనలను శోధింపబడనిస్తాడు.

దేవుడు ఎవరిని శోధింపడు అను భావనను వ్యతిరేకించు విధముగా 2సమూ 24:1 కనిపిస్తుంది. కానీ సమాంతర వాక్యభాగము 1దినా 21:1 లో సాతను చేసెను అని ఉన్నది. దేవుడు దావీదును అపవాదిచే శోధింపబడనిచ్చెను అని భావన.

ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి–నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.(2 సమూ 24:1).

తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా (1 దిన 21:1).

నియమము:

శోధింపబడుట పాపముకాదు, శోధనకు లోబడుట పాపము.

అన్వయము:

పాపము కాదు. అపవాది ప్రభువును సహితము శోధించాడు. (మత్తయి 4:1). శోధింపబడుట పాపముకాదు, శోధనకు లోబడుట పాపము. మన తలల మీదుగా పక్షులు ఎగరకుండా ఆపలేము గాని అవి మన వెంట్రుకలలో గూళ్ళు కట్టకుండా చూసుకోగలము.

Share