సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును
సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును;
మండే ఎండ పువ్వుమీద పడినప్పుడు, అది ఇప్పుడు అందవిహీనమైన కొమ్మ. ఐశ్వర్యము దాని మెరుగును, రూపును పోగొట్టుకుంటుంది. ఐశ్వర్యము తన ఆకర్షణను కోల్పోయే రోజు ఒకటుంది. ఐశ్వర్యము వాడిపోతుంది.
ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును.
ఐశ్వర్యము కొరకైనా ప్రాకులాట నిష్ప్రయోజనము. దేవుడు అంతిమ విలువను ప్రరీక్షించినపుడు అది దేనికి పనికిరాకుండా ఉంటుంది.
“తన ప్రయత్నములన్నిటిలో” అనగా “తన ప్రయాణములన్నిటిలో” (4:13-15). ధనికుడు తన ఐశ్వర్యమును నిర్వహించు ప్రణాళికలు ఉపాయములు గతించిపోతాయి. ధనికులు దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. ఐశ్వర్యము పైన సరియైన ధృక్పథము కలిగిఉండాలి అనేది కీలక విషయము – నిత్యత్వ దృక్పధములో వ్యకిగత సంపద అంతిమ పరిశీలనలో అంతగా లెక్కకు రాదు. ఆత్మీయ సంపద దేవుని ధృష్టిలో ముఖ్యమైనది. వ్యక్తిగత సంపదలన్నీ ఆ గొడుగుక్రిందికే వస్తాయి.
నియమము:
ధనవంతులగుటయే జీవిత అంతిమ లక్ష్యముగా కలిగిఉండటము దూరాలోచన లేకపోవడమే.
అన్వయము:
మనకోసమే సమకూర్చుకున్న సంపద మనలను మెరుగు పర్చదు. ఇందులో స్వకీయతకు గొప్ప ముప్పు ఉన్నది.
సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును. (ప్రసంగి 5:13).
దక్షిణ అమెరికాలో అనేకుల గొప్ప గురి ధనవంతులగుట. అయినప్పటికి మరణదినము వస్తుంది. ఆరోగ్యమును వారు పోగొట్టుకుంటే వారు ఐశ్వర్యమును ఆనందించలేరు. ధనార్జన గురిగా కలిగిన జీవితము దూరాలోచనా లేకపోవుటయే. ఐశ్వర్యము వాడిపోవునది. ధనార్జనకొరకు చేసే ప్రయాసతోకూడిన ప్రయాణాలన్నీ ఎందుకూ పనికిరానివి.