Select Page
Read Introduction to James యాకోబు

 

అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు

 

అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై

ద్విమనస్కుడు అనగా రెండు జీవితాలు కలిగినవాడు. రెండి జీవితాలుకలిగిన వాడు అస్థిరమైనవాడై, దేవునిగూర్చి సంశయము కలిగివుంటాడు.దేవునిని పాక్షికంగా విశ్వసిస్తాడు, పాక్షికంగా అపనమ్మిక కలిగిఉంటాడు – దేవునిని నమ్మలో లేదో అన్న వివాదములో ఉంటాడు.

5-7 వచనాలలోని వ్యక్తి, జ్ఞానము కోడువగాఉన్న ద్విమనాస్కుడు కానీ విశ్వాసముటి దానికొరకు దేవుని అడుగడు. తన ప్రార్ధనాజీవితము ముందుకు వెనుకకు కదలుచున్న ఎగసిపడే సముద్రము వంటిది. 

తన సమస్త మార్గములయందు అస్థిరుడు

ద్విమనస్కుడు, అస్థిరమైన, చంచలమైన, చపలమైన వాడు. అతని విశ్వాసము త్రాగినవానివలె, జీవిత మార్గములో తూలిపడే విధముగా ఉంటుంది. జీవితముయొక్క ఆటుపోట్లకు తడబడే విశ్వాసము కలవారు దేవుని గౌరవమును పొందరు, ఎందుకంటే వారు దేవునికి ఇతరమైనవాటికి వారి నమ్మకత్వాన్ని విభాగిస్తారు.సాధారణముగా వత్తిడి వారు దిగజారునట్లు చేస్తుంది.  

సందేహము దేవుని యొద్ద నుండి పొందుటకు అవసరమైన విశ్వాసాన్ని మొద్దుబారునట్లు చేస్తుంది.  దేవుని వాగ్దానముమీద ధృడమైన విశ్వాసముద్వారా దేవునినుండి పొందుకొను ఆత్మీయ జీవితముకు వ్యతిరేకముగా అది అస్తవ్యస్తమైన ఆత్మీయ జీవితము సృష్టిస్తుంది.

నియమము:

స్థిరమైన క్రైస్తవులు వారి వనరులకు విశ్వాసముతో దేవుని వైపు చూస్తారు.

అన్వయము:

ద్విమనస్కుడు ఎల్లప్పుడు రెండు నమ్మిక విధానాలను అనుసరిస్తాడు. ఆలాచేస్తు దేవుని పట్ల దేవునిపై యధార్ధమైన నమ్మిక కలిగి ఉండలేము అని యేసు చెప్పెను.

అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు

పెదవులతో పలుకుదురు. (కీర్తనలు  12:2).

ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. (మత్తయి 6:24).

దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి(యాకోబు 4:8).

మనము ఏకమనసు కలిగిఉండాలి కానీ ద్వమన్సూకాదు  అని  దేవుడు కోరుతున్నాడు. బలమైన ఒప్పుకోలు కలిగిన క్రైస్తవులు శక్తివంతమైనవారు. భిన్నమైన మనసు కలవారు నిలబడలేరు.

నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. (ద్వితీ 6:5).

యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము.

నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. (కీర్తనలు 86:11).

మన అభిప్రాయములను స్థిరపరచుకోవలసిన సమయము ఇది. ఎంత ఎక్కువగా వేచివుంటే క్రైస్తవజీవితములో అంత శక్తిని పోగొట్టుకుంటాము. విరుద్దమైన కోరికలు ఆత్మీయంగా బలహీనపరుస్తాయి. ఒకే సమయములో దేవునిని మరియు మన పాపేచ్చలను సంతృప్తి పర్చలేము. నిజమైన విశ్వాసము అన్నిసార్లు బాహాట ఎంపికలతో పనిచేయదు, ఎందుకంటే ఆత్మీయజీవితములోనికి ఇది ఆస్తిరత్వాన్ని చొప్పిస్తుంది. అయియినను, అసలైన విశ్వాసము దేవుని చిత్తానికి క్రైస్తవ జీవిత ఔన్నత్యానికి హృదయపూర్వకముగా అప్పగించుకుంటుంది.

ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి –యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపులమధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిననుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.౹(1 రాజులు 18:21).

అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. (2 తిమోతి 3:1-5)

Share