మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.
మీరు సంపూర్ణులును
సంపూర్ణత అనగా ముగించుట, గమ్యాన్ని చేరుట. ఉన్న గమ్యము లేక ఉద్దేశంవైపుగా పరిపూర్ణత అనే భావనకలిగియుంది. (1:17,25; 3:2). శ్రమలనే దేవుని పద్దతి మనను బాధకు గురిచేయడానికి కాదు కాని ఉద్దేశపూర్వకమైనది. తన సార్వభౌమ ప్రణాళిక ద్వారా మనను దేవుడు ఒక విజయవంతమైన పరిపూర్ణతకు నడిపించుటకు ఆసకతికలిగియున్నాడు.
“సంపూర్ణత” అనగా సంపూర్ణ పాప రహిత పరిపూర్ణత అని కాదు కాని అత్మియ స్థిరత్వము. ఎంత ఎక్కువగా పరిణతిచెందితే అంత ఎక్కువగా దేవుని రాజ్యముకై అంతగా ప్రయోజనకారులుగా ఉంటాము. దేవుడు వారికొరకు కలిగియున్న గురిని చేరుకునేవారు పరిణతిచెందినవారు. పరిణతి అనగా సంపూర్ణతను చేరుకొనుట కాదు కాని తన అనుభవములో అధికభాగము దేవుని వాక్యపు నియమాలను అన్వయించుకొనుట. పరిణతిచెందిన వ్యక్తి కొన్ని సమయాల్లోతొట్రిల్లి, పడి తిరిగి లేవవచ్చు కాని అధిక సంధర్భాలలో అనుభవానికి సత్యాన్ని తప్పక అన్వయించుకుంటాడు. తాను తొట్రిల్లిన వాస్తవం తన అంతిమ పరిణతికి సంఘటనాత్మకము.
ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము. అప్పుడు దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలు పరచును. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. (ఫిలిప్పీ 3:12-16).
నియమం:
క్రైసవుడగుట ఒక ఎత్తైతే, పరిణతిగల విశ్వాసియగుట మరొక ఎత్తు.
అన్వయం:
శిశువు ఒక వ్యక్తి కాని వయోజనుడు కాడు. వయోజనుడని ప్రజలు పిలిచే స్థానంవద్ద ఉన్నదానికి ముందుగా ఆ శిశువు అనేక సంవత్సరాల అభివృధ్ధిగుండా వెళ్ళాలి. ప్రారంభములో, నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తరచుగా పడటం జరుగుతుంది. దానిని మనము నిరుత్సాహపరచము, ఎందుకనగా నడకనేర్చుకునే విధానములో అది భాగము. అభివృధ్ధిలో శ్రమ ఒక భాగము.
ఓర్పు విశ్వాసిలో పరిణతిని కలిగిస్తుంది. దేవుని పద్దతిలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కునువారు పరిణతికలిగి, శ్రమలలో సహితము విశ్వాసముతో దేవునితో నడిచిన వారిని పోలి యధార్ధతతో జీవిస్తారు. అప్పుడు మనము నిజమైన ఆత్మీయ సంపూర్ణులుగా జీవించగలము (గలతీ 5:14). పరిణతి చెందుట ప్రతి విశ్వాసి యొక్క ధ్యేయమై ఉండాలి.