మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.
మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు
“పడునప్పుడు” అను మాట అనివార్యముగా మనము శ్రమలను ఎదుర్కోవాలని సూచిస్తుంది.
ఏ క్రైస్తవుడు శ్రమనుండి తప్పుకోలేడు. గ్రీకుభాషలో పదము “పడున ప్రతిసారి” అనే విధముగా ఉన్నది, “ఒక వేళ పడితే” అని లేదు. నిస్సంకోచముగా సమస్య వస్తుంది.
నియమము:
ప్రతి క్రైస్తవుడు అనివార్యముగా శ్రమను ఎదురుకుంటాడు.
అన్వయము :
శ్రమలన్నీ విశ్వాసి ప్రయోజనానికే. ఈ శ్రమలు శోధనలు కాదు, ఆత్మకు కలిగే శ్రమలు.శ్రమ, కష్టము లేకుండా ఎవరి జీవితము ఉండదు. అది పతనము యొక్క ఫలితము. ప్రతీ క్రైస్తవుడు శ్రమను ఎక్స్ పెక్ట్ చేసి, వాక్యానుసారమైన తట్టుకొనగలిగిన విధానమును అభివృద్ది చేసుకోవాలి.
దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల మీ మాట కూడా గైకొందురు. (యోహాను 15:20).
నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. (యోహాను 16:33).
క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. (2 తిమో 3:12).