ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత
కొలొస్సయులు మరియు లావోదొకయా సమాజములలో కొలొస్సయుల పత్రిక బహిరంగంగా చదవబడతుందని పౌలు ఆశించాడు. వాక్యము బహిరంగంగా చదవడానికి ఈ సంధార్భము ఆది సంఘము ఆరాధనను ఎలా ఆచరించింది అనేదానికి కొంత సూచన ఇస్తుంది.
“చదవించుకొనుట” అంటే కొలొస్సయులను వ్యాఖ్యానము చేయుట. కొన్ని సంఘములు బైబిల్ వచనము వెంబడి వచనము ద్వారా వివరిస్తాయి. మనం వాక్యాన్ని అధ్యయనం చేయాలని దేవుడు కోరుకుంటాడు.
లవొదికయ వారి సంఘములోను చదివించుడి
లావోదోకయ సంఘములో కూడా కొలొస్సయులు బహిరంగంగా చదవబడునని పౌలు ఊహించాడు. క్రొత్త నిబంధన సంఘములు బైబిల్లోని పుస్తకాలను పంచుకున్నాయి. కొలస్సీ పత్రిక స్పష్టంగా ఇతర సంఘములకు కూడా ఉద్దేశించబడినది. ఇది నేటి సంఘము కోసం ఉద్దేశించబడింది.
లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.
లావోదొకయా నుండి వచ్చిన పత్రిక ఇప్పుడు పోయింది. ఇది “కానన్” అని పిలువబడే బైబిల్ యొక్క అధీకృత పుస్తకాలకు చెందినది కాదు. కానన్ అనగా సంఘము ప్రేరేపితమని భావించిన పుస్తకాలు.
పౌలు రాసిన అన్ని పత్రికలు ప్రేరణ పొందలేదు. అయితే, లావోదోకయా లేఖ ఎఫెసీయుల పత్రిక కావచ్చు. ప్రకటన సంఘము మొదటి మరియు ఏడవది ఎఫెసుస్ మరియు లావోదొకయా. ఈ లేఖ మొదట ఎఫెసుస్‌కు, ఆ సర్క్యూట్‌లోని ఇతర చర్చిలకు పంపబడింది చివరిగా లావోదోకయకు పంపబడినది . కాబట్టి, ఈ పత్రిక ఎఫెసీయుల పత్రిక కావచ్చు.
పౌలు రాసిన లేఖలను ఆ ప్రాంతంలోని అన్ని సంఘములు చదవవలసి ఉంది.
నియమము:
దేవుని వాక్యంలో పెరుగుదలకు స్థానిక సంఘమును దేవుడు రూపొందించాడు.
అన్వయము:
స్థానిక సంఘములు భౌగోళికంగా గుర్తించబడ్డాయి. తిరిగి జన్మించిన ప్రజలు స్థానిక సంఘముగా యేర్పడుతారు. ఈ వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా మిషనరీ సంస్థకు మద్దతు ఇస్తున్నారు. అక్కడే వారు వరముగల సంఘకాపరి నుండి బైబిలు అధ్యయనం చేయాలి.
మీరు దేవుని వాక్యాన్ని బోధించే సంఘమునకు హాజరవుతున్నారా?