Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమునుగూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి.

 

నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన

మర్మమును బొడించుటచే పౌలు జైలులో నిర్భిందించబడ్డాడు. సువార్త పౌలును బోధించడానికి బలవంతం చేసింది. అతను చేయకపోతే “శ్రమ” యొక్క భారాన్ని అతను అనుభవించాడు (I కొరిం. 9 :16; అపొస్తలుల కార్యములు 4 :20).

పౌలు జైలులో మాత్రమే కాదు, అతను బంధకాలలో ఉన్నాడు. పరిస్థితులు సుఖంగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటించడం చాలా సులభం. పౌలు బోధించాడా లేదా అనే విషయం సౌకర్యము ప్రభావితం చేయలేదు. పౌలు గొలుసులతో కూర్చుని, ప్రతికూల పరిస్థితులలో కూడా బోధించడానికి దేవుడు తనకు అవకాశం కల్పించాలని ప్రార్థించమని కొలొస్సయులను కోరుతున్నాడు. పౌలు ప్రతి మానవుడిలో సంభావ్య మార్పిడిని చూశాడు. మనము ప్రజలలో, విరోధ వ్యక్తులను, బలహీనమైన వ్యక్తులను, ప్రతికూల వ్యక్తులను చూస్తాము. పౌలు చూసినదంతా క్రీస్తు తమ కొరకు మరణించిన ఆత్మలు.

పౌలు తన జైలు శిక్ష గురించి తరచుగా మాట్లాడాడు (ఫిలి. 1:7, 13-14, 16; కొల 4:18; ఫిలే. 1, 9-10,13). పౌలు జైలులో ఉంచబడుటకు కారణము సువార్త. అతను ప్రతికూల పరిస్థితిని తీసుకొని దానిని ఆశీర్వాదంగా మార్చుకున్నాడు. రోమా జైలులో కూర్చున్నప్పుడు, అతను 2000 సంవత్సరాలు పరిశుధ్దాత్మ క్రైస్తవులను ఆశీర్వదించిన ఉపదేశాలను వ్రాస్తాడు.

నియమము:

పౌలు ఎప్పుడూ తన ప్రతికూల పరిస్థితులను తీసుకొని వాటిని ఆశీర్వాదంగా మార్చుకున్నాడు.

అన్వయము:

మీరు మీ పరిస్థితుల గురించి ఫిర్యాదు చేస్తున్నారా లేదా మీ శాపాలను చురుకుగా ఆశీర్వాదంగా మార్చుకోగలుగుచున్నారా?

Share