Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

దాసులారా, మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి.

 

ప్రభువునకు భయపడుచు

” ప్రభువునకు భయపడుచు” అ౦టే మన౦ దేవునిపట్ల గౌరవ౦తో పనిచేస్తామని అర్థ౦. మనం దేవుడి కోసం పనిచేస్తున్నట్లుగా మన ఉపాధిలో పనిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.

ప్రతిక్షణం దేవుడి నిఘాలో మనము ఉన్నాము. మన పని యొక్క నాణ్యత దేవుడు చూస్తున్నదానిని ప్రతిబింబించాలి. పాత నిబంధనలో దేవుని పేర్లలో ఒకటి ఎల్ రోయి, “చూసే దేవుడు.” మీ యజమాని దృష్టి మీపై ఉన్నాను లేకున్నను ఆయన గమనిస్తున్నారు.

శుద్ధాంతఃకరణగలవారై

” శుద్ధాంతఃకరణగలవారై ” అ౦టే సరళత, నిష్కపటమైన, యథార్థమైన, నిర్మొహమాట౦గా ఉ౦డుట. ” శుద్ధాంతఃకరణగలవారై ” మొదట అంటే “సరళమైనది” అని అర్థం వచ్చింది. దీని అర్థం ఏ కుటిలపు ఉద్దేశ్యం కాదు. యదార్థ హృదయపు ప్రేరణతో మనం పనిచేయాలని దేవుడు కోరుకుంటాడు. ఇది యజమానిని సంతోషింపజేయడానికి చేయు పనిచేయడం దాటి వెళుతుంది. ఈ వ్యక్తి స్వచ్ఛమైన ఉద్దేశాలతో, యేక ప్రయోజనం (ఎఫెస్సీ. 6:5) తో పనిచేస్తుంటాడు.

నియమము:

ఒక అంతర వీక్షణము నుంచి, శీలము యొక్క వీక్షణము నుంచి క్రైస్తవుడు తన యజమానికి సేవలందిస్తాడు.

అన్వయము:

క్రైస్తవుడు శీలము నుండి పనిచేస్తాడు; ఎవరు చూస్తున్నా లేదా చూడకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదగినవాడు, నమ్మకస్తుడు. అది ఒక క్రైస్తవునికి, క్రైస్తవేతర పనివానికి మధ్య ఉన్న తేడాను తెలిపే విషయం.

Share