Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

 

కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు

మన హృదయాలలో కృపతో పాడే వరకు మనం నిజంగా పాడము. ఇది ఆత్మ యొక్క పాట. ఆ వ్యక్తి చాలా బాగా పాడలేకపోవచ్చు కానీ ఆ పాట మాత్రం గుండెలో విరిసింది. అ౦దుకే బైబిలు “యెహోవాకు ఆన౦దకరమైన ధ్వని చేయుచున్నాను” అని చెబుతో౦ది. కొందరు శృతి ప్రకారము పాడగలరు మరికొందరు అలా చేయలేరు కానీ ఆ విషయం హృదయము యొక్క వ్యక్తీకరణ. బహుశా అందుకే దేవునికి ఆనంద “ధ్వని”ని చేయుటను అనుమతిస్తుంది!!

మన హృదయములలో కృతజ్ఞత లేకపోతే మనము ప్రభువును కీర్తించలేము. క్రైస్తవేతరలు తమ హృదయములలో ప్రభువుకు కృతజ్ఞతతో పాడలేరు. దేవుని ఏర్పాట్ల గురి౦చి కొద్దిపాటి అవగాహన ఉన్న క్రైస్తవుడు ప్రభువు పట్ల తమ హృదయాల్లో కృతజ్ఞతతో పాడలేడు (ఎఫ. 5:19). కొ౦దరు క్రైస్తవులు పాడుతున్నప్పుడు కాకుల్లా ధ్వని౦చుతారు. దేవుడు కాకులను అలాగే కోయిలను చేస్తాడు. మనలో కొందరు లోలోపల అత్యుత్తమంగా పాడతారు.

నిజమైన విషయాన్ని పాడితే సరిపోదు. దేవుడు మన హృదయాలతో అలాగే మన పెదవులతో పాడాలని కోరుకుంటాడు.

” కృపా సహితముగా ” అ౦టే హృదయ౦ ను౦డి పాడడానికి దేవుని కృప సహాయ౦ అవసర౦.

నియమము:

కృప అనేది క్రైస్తవుని పాటకు ఆధారం.

అన్వయము:

వారి గానం ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంఘము గురించి మనం ఎంతో చెప్పగలం. వారు పాడే దాని ద్వారానే కాదు, ఎలా పాడతారు అనేదానిని బట్టి మనం చెప్పగలం. బైబిలును  గౌరవింస్తున్నారా లేదా రక్షకుని ప్రకటిస్తున్నారా లేదా అనునది పాడటం ద్వారా తెలియజేయవచ్చు. మన౦ జాన్ వెస్లీ ప్రసంగము వినాలనుకుంటే చేయాలనుకుంటే ఛార్లెస్ వెస్లీ స౦గీత౦ ఉ౦డాలి. మనకు డి. ఎల్. మోడి ప్రసంగించాలనుకుంటే ఇరా సాకీ సంగీతం ఉండాలి. మన౦ బిల్లీ గ్రహం ప్రసంగము వినాలనుకుంటే చేయాలనుకుంటే  క్లిఫ్ స౦గీత౦ ఉ౦డాలి. అవి రెండు కలసి కొనసాగుతాయి. మృతమైన ప్రసంగము మృతమైన సంగీతముతో నిండి ఉంటుంది.  నిజమైన సంగీతము యొక్క ఆధారము దేవుని కృప యొక్క యేర్పాటు.

” అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు” (యాకోబు 3:14). మన హృదయాల్లో సహింపనలవికానిమత్సరమును వివాదమును, మనం మన హృదయాలలో కృపతో పాడలేము. శత్రుత్వం, విమర్శ నిండిన హృదయం పాడలేదు. చెడుగుతో నిండిన మన హృదయం శృతి తప్పుపుంది.

Share