ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు
“ఇట్టివారిలో” అంటే “ఏ స్థితిలో” అని అర్థం. క్రీస్తులో క్రైస్తవ్యములో వర్గ భేదాలు లేవు. ప్రజలు సమానంగా జన్మించరని మనం గుర్తుంచుకోవాలి. మనకు భిన్నమైన ఐ.క్యూ. లు, శారీరక సౌందర్యం, బలం ఉన్నాయి. ఈ జీవితంలో నిజమైన సమానత్వం లాంటిదేమీ లేదు. మానవ జాతి సభ్యులు సమానంగా జన్మించరు కాని మరుమనసు ప్రజలకు నిజమైన సమానత్వాన్ని తెస్తుంది. “ఇట్టివారిలో” క్రీస్తులో మన స్థానాన్ని సూచిస్తుంది. ఇది మతం నుండి మనల్ని వేరు చేస్తుంది.
నియమము:
మరుమనసు నిజమైన సమానత్వాన్ని తెస్తుంది.
అన్వయము:
ఈ జీవితంలో ప్రజలు శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా సమానం కాదు. సువార్త మాత్రమే ప్రజలను దేవునితో మరియు ఇతరులతో సమానంగా ఉంచగలదు.
మరుమనసు అంటే కొత్త జన్మము. మనము శారీరకంగా మొదటిసారి జన్మించాము. తదనంతరం మనం ఆధ్యాత్మికంగా పుట్టాలి. మీకు ఆధ్యాత్మిక పుట్టుక ఉందా (యోహాను 3:3,7)? ఆధ్యాత్మిక జన్మను ఎలా పొందాలో యోహాను 3 చెబుతుంది – యేసుక్రీస్తు మన పాపము నుండి మనలను రక్షిస్తాడు అని మనం నమ్మాలి (3:16). మీరు ఈ రోజు ఆధ్యాత్మికంగా పుట్టడానికి సిద్ధంగా ఉన్నారా?