Select Page
Read Introduction to Colossians కొలస్సయులకు

 

అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.

 

పౌలు న్యాయవాదము, సన్యాసవాదము యొక్క వ్యర్థతను గురి౦చిన విషయాలను వివరి౦చాడు. ఆంక్షలు కొంతమంది వ్యక్తులను ఆకట్టుకుంటాయి, ఎందుకంటే ఆంక్షలను అభ్యసించే వారు శరీరపు కోరికలను జయించినవారని భావిస్తారు.

అట్టివి ….జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని

” అట్టివి ” న్యాయవాదము, సన్యాసవాదములను సూచిస్తుంది. న్యాయవాదకులు ఇతరులకంటే తెలివైనే వారిగా భావిస్తారు. వారు జ్ఞానాన్ని ఒక “స్వరూపం” (చూపించు) కలిగిఉన్నవారుగా కనిపిస్తారు; అది నిజమైన జ్ఞానము కాదు; అది నటన. “జ్ఞానము” క్రీస్తు మీద కేంద్రీకృతమైన ఆధ్యాత్మికత. కొన్ని ఇవాంజెలికల్ గుంపులలో ఆధ్యాత్మికత కోసం ఆంక్షలు అనుసరించబడుతుంది.

స్వేచ్ఛారాధన విషయములోను

” స్వేచ్ఛారాధన ” అనే పదానికి ఏకపక్ష మరియు అనవసరమైన భక్తి అని అర్ధం. న్యావాదము అతిభక్తి. మనం మనుష్యుల నుండి వచ్చిన నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు, కృపా సువార్త యొక్క సారాంశానికి విరుద్ధంగా పనిచేస్తాము (గల. 5:1). మానవ నిర్మిత మతం ఎల్లప్పుడూ ఏదో ఒక రకమైన సన్యాసం వైపు ఉంటుంది.

మనుషులు తమ స్వంత కోరికలు మరియు చొరవల నుంచి వచ్చే మతపరమైన నమ్మకాలను మరియు ఆచరణలను ఆవిష్కరించడానికి ఇష్టపడుతారు. ఇది స్వేచ్ఛారాధన, తనకు తాను-స్వీయముగా ఏర్పాటుచేసుకున్న మతం. క్రైస్తవులు దేవుని మీద తమ స్వంత చిత్తాన్నిరుద్దుతున్నప్పుడు, వారు అర్ధరహితమైన విశ్వాసవ్యవస్తలను తయారుచేస్తారు. ఇది మనిషి యొక్క చిత్తము మెడ ఆధారపడిన భక్తి, భావావాదం మరియు అనుభూతులపై ఆధారపడిన మతం.

నియమము:

మనుషులు కనిపెట్టిన మత వ్యవస్థలను మనం నివారించాలని దేవుడు కోరుతున్నాడు.

అన్వయము:

ప్రజలు మతాన్ని ప్రేమిస్తారు. ఒకటి లేకపోతే ఒకటి కనిపెడ్తారు. కొలొస్సయులు కాల౦లో మాదిరిగా ఇరవై ఒకటవ శతాబ్ద౦లో ఎవాంజెలికల్ క్రైస్తవత్వ౦, క్రొత్త మత రూపాలను కనుగొనదానికి ఇష్టపడుతుంది. మనం న్యాయవాదము, సన్యాసవాదము, అనుభూతివాదమును ఇష్టపడతాం. అదే సమయ౦లో, దేవుడు మన ను౦డి నిజ౦గా కోరుకు౦టున్నదానికి మనల్ని మన౦ బహిర్గత౦ చేసే విషయ౦లో మన౦దేవుని వాక్యమునకు మనలను మనము బహిర్గీతము చేసుకొనుటకు ప్రయత్న౦ చేయడ౦ లేదు.

మనం దేవుని వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు దేవుని కృపకు దూరంగా వెళ్తూఉంటాము.

Share